పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/425

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒ క్కొ క్క మె తు కు

      ముగ్గురుపిల్లలుకలిసి వంటలుచేసికొని ఒకరిని పండిస్తారు.  "వంట" అంటే ముగ్గురు వలయంగానిలిచి ఒకరిచేతులు మరొకరిచేతులకు తగిలించి పట్టుకొనిపైకెత్తి ఒక్కసరిగావిడిచిపెట్టి ఎవరిచేతులువారు ప్లస్ గా గాని, లేక నమస్కారంపెడుతున్నట్లు గాగాని పెడతారు.  ముగ్గురూ ఒకేలాగ పెడితే మళ్ళీవంటలు వేసుకోవాలి.  అందులోయిద్దరు ఒకలాగ ఒకరుమరొకలగ పెడితే ఆ ఒక్కరు పండినట్టు.  మిగిలినయిద్దరూ ఒకరిది కుడిచెయ్యి, రెండవవారిది ఎడమచెయ్యి వ్రేళ్ళలోకి గ్రుచ్చి క్రిందికిదించి ఉయ్యాలలాపట్టుకొనగా, వండినవారు తన మోకాలుండిచి దానిమీదపెట్టి రెండవకాలుజారవిడిచి, వారి యిరువురిభుజాలమీదా చేతులుమోపి ఆనితే ఆ మోసేవాళ్ళు -

                               "ఒక్కొక్కమెతుకు - గుక్కుడేసి గంజి
                                గాదికిందెలుక - గైరమ్మ పెళ్ళి
                           గూట్లోరూపాయ్ నీ మొగుడు సిపాయ్".

       అని ఒకరు ముందుచరణం, రెండవవారు రెండవచరణం పాడుతూ వాళ్ళు ముందునిర్ణయించుకున్న స్థలంవరకూ తీసుకెళ్ళి దింపుతారు.  మరల అక్కడ వంటలు చేసికొని ఎవరువండితేవారిని మళ్ళీ మోస్తుంటారు.  తాముఎన్నుకున్న వ్యక్తిని అందలమెక్కించి గౌరవంచడమే జనస్వామ్య శిక్షణ గరుపుతుంది.  ఈ ఆట.
                                  వె న్నె ల్లో గి లి గి చ్చ
      వెన్నెలరాత్రులలో పిల్లలు చీకటివెన్నెలలమధ్యే ఈ ఆట ఆడతారు వంటలు చేసికొని దొంగను నిర్ణయిస్తారు.  ఈ దొంగ "వెన్నెల్లో గిలిగిచ్చా వెన్నాముద్దలు తిన్నాము" అని పాడుతూ వెన్నెలలో వాళ్ళునిర్ణయించుకున్న పరిధితో ఈకొసనుంచి ఆ కొసకుతిరుగుతుంటే మిగిలినపిల్లలు వెన్నెల్లోకి, చీకట్లోకి పరుగులెడుతుంటారు.  ఇలా పాడుతూ తిరుగుతూ వెన్నెట్లోఉండగా గొంగ ఎవరయినా పట్టుకోగలిగితే వాళ్ళు దొంగగా తిరగాలి.  ఈ ఆట పిల్లలలో ఆహ్లాదాన్నీ, చురుకుదనాన్నీ, అలతిఅలతి దేహపరిశ్రమనూ కలిగిస్తుంది.