పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/424

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్రాడు ఆట

ఆడపిల్లలు దాదాపు తమ పొడవుగల త్రాడును చేతులతో తమకాళ్ల క్రిందనుంచి తలపైకిత్రిప్పుతూ, కాళ్లకు తగలకుండా గెంతుతుంటారు. అలా ఏకబిగిని ఎవరు ఎక్కువసార్లు త్రిప్పితే వారు గెలిచినట్లు.

దీనితోనే మరొక ఆట కూడా ఆడతారు. పిల్లలందరూ ఒకే చోట ఒకేసారి ఇలా గెంతుతూ బయలుదేరి నిర్దేశించుకున్న స్థలానికి ఎవరు ముందు చేరితే వాళ్ళు గెలిచినట్టు.

ఇది కాళ్ళకూ, చేతులకూ, ఏకాగ్రతకూ సంబంధించిన పరిశ్రమ. చక్కని పోటీ మనస్తత్వం, పురోగతిపై ఆకాంక్ష కలిగిస్తుంది ఈ ఆట.