పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/423

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరమాన్నం వండేను.
పరమాన్నం ఏంచేశావు?
ఉడ్డిమీదెట్టేను.
నాక్కొంచెం పెట్టవా?

    లేదు. మావాళ్ళ పిల్లొచ్చి అయింతా నాకిపోయింది.  అనగానే అందరూ కిలకిలా నవ్వుకుంటారు.  ఇది చాలవరకు ముక్తపదగ్రస్తజ్ం కావడంవల్ల ఎంతచేతాడైనా గుర్తుంచుకోవడం సులువు.  దీని వల్ల చిన్న పిల్లలకు ధారణ, బాఆశ్ఃఆ ఆళావడ్డమేకాకుండా వస్తువులూ అవి చేసేపనులూ అవగతమవుతాయి.     
                             చె మ్మ చె క్క
   ఇద్దరుగాని, ముగ్గురుగాని ఆడపిల్లలు ఎదురుబొదురు నిలుచుని ఒక లయప్రకారం వెనక్కీ ముందుకీ ఎగురుతూ తమ రెండూరచేతులనూ ఎదుటివారి అరచేతులకుతాకిస్తూ "చెమ్మ చెక్క, చారడేసిమొగ్గ, అట్లపొయ్యంగ, ఆరగించంగ, ముత్యాల పందిట్లో ముగ్గులెయ్యంగ, రత్నాల పందిట్లో రంగులెయ్యంగ," "సుబ్బారాయుడు పెళ్ళీ, చూసివద్దాంరండి, అమ్మానాకూబువ్వ, అరచేతిలో గవ్వ" అంటూ పాడుతూ గెంతుతుంటారు అలసిపోయేవరకూ.  ఇది శారీరకపరిశ్రమేగాకుండా, నాట్యారంభానికి అంకురార్పణకూడా.  అంతేగాకుండా ఈ చేతులు తాకించడంలో తాళం, పాడడంలో గానం మిళితమైఉండడంతో వానిఅభ్యాసానికికూడాఇది ప్రధమ సోపానమని చెప్పవచ్చు.
                  ఒ ప్పు ల కు ప్ప
  ఇద్దరుఆడపిల్లలు ఎదురెదురుగా నిలుచుని ఒకరికుడిచేతిని మరొకరి ఎడమచేతితోనూ ఒకరిఎడమచేతిని మరొకరికుడిచేతితోనూ గట్టిగాపట్టుకుని పాదములు ఎదురెదురుగా దగ్గరగాపెట్టి,కొంచెంబిగురువావుండేలా వనక్కివాలి, గుండ్రంగా తిరుగుతూ, "ఒప్పులకుబ్బా, వయ్యారిభాంఆఆ, శాయిపప్పు, సన్నబియ్యం, నోట్లోతవుడు, నీమొగుడెవరు?" అనిపాడుతూ గిర్రునతిరుగుతూ గాలిలో తేలిపోతున్న అందాల ఆనందానుభూతినిపొందు తారు.  పెళ్ళీకానిపిల్లలకు మొగుడు అనేమాట ఒకపులకరింత.