పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/396

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

21. బ్రహ్మజోస్యుల సుబ్బారావుగారు.

 రాజమండ్రి.  హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, బొబ్బిలియుద్ధంలో రంగారావు వేషాలువేసేవారు.  వీరి పాత్రపోషణలో అసలు రంగారావును కళ్ళెదుట పెట్టేవారు.

22. మద్దాలి శేషగిరిరావుగారు.

  రాజమండ్రి. చిత్రనళినీయంలో నలుడుగానూ, బాహుకునిగానూ అద్భుతంగా నటింఛేవారు.  బొబ్బిలియుద్ధంనాటకంలో పాపారాయుడు పాత్రకు తనకు సాటిలేరనిపించేవారు.  కమ్మనిస్వరం. స్ఫుటమైన వాచకం, నటనలోదిట్ట.  ద్రౌపదీ వస్త్రాపహరణలో భీమునిపాత్రకు ఆనయకాయనే సాటి  "వందెమిడిన ఆబాహువబవంచలుగచేయున్" అని పాడుతూ క్రోధాన్ని అభినయిస్తుంటే ప్రేక్షకులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయేవారు.

23. వెల్లంకి వెంకటేశ్వర్లుగారు.

    రాజమండ్రి. బొబ్బిలియుద్ధంలో వెంగళరాయుడుపాత్ర అసమానంగా పోషించేవారు.

24. నిడుముక్కల సుబ్బారావుగారు.

     రాగమండ్రి. సావిత్రిలో సత్యవంతునిగా సమర్దవంతంగా నటించేవారు.

25. ముప్పిడి జగ్గరాజుగారు.

   రాజమండ్రి. హరిశ్చంద్రలో చంద్రమతిపాత్రధరించి అందులో లీనమై నటించేవారు.  శ్మశానంసీనులో దు:ఖంఆగక గ్లిజరిన్ అక్కరలేకుండా నిజంగానె ఏడ్చేసేవారట.  ఒకోసారి దు:ఖంఆపుకోలేక గ్రీన్ రూం లోకి పోయి అది ఆగిపోయినతరువాత మళ్ళీవచ్చి నటించేవారట.

26. బెల్లంకొండ సుబ్బారావుగారు.

    ఏలూరు.  న్యాయవాది.  కురుక్షేత్రం లో కృష్ణుడుగానూ, గయోపాఖ్యానంలో కృష్ణుడుగానూ చాలాపేరుతెచ్చుకున్నారు.  వీరు మీసాలు తియ్యకుండానే కృష్ణుడువేషంవేసేవారు.  అందువల్ల వీరిని మీసాలకృష్ణుడనేవారు.