పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/395

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తలు. రంగూన్ రౌడీ నాటకంలో రౌడీ పాత్ర చూసితీరవలనంత గొప్పగావేసేవారు. ఈ రచయిత వీరి రౌడె నాటకంలో "జయరాం" పాత్ర వేసేవారు.

18. మంత్రిప్రగడ రామదాసుగారు.

    మకాం కొంకుదురు. చక్కనిహాస్యనటులు.  రంగూన్ రౌడీలో గంగారాంసేట్ వేషానికి ఆయనతరువాతే ఎవరయినా, వరవిక్రయంలో పెళ్ళిళ్ళపేరయ్య, పద్మవ్యూహంలో సైంధవుడు, సక్కుబాయిలో అత్త, "సెట్టమారిమగడు" నాటకంలో వెర్రిబుర్రల వెంగళప్ప, చింతామణిలో సుబ్బిశెట్టి వేషాలు కడుపుబ్బ నవ్వు తెప్పించేవి.  అసలు ఆయన ప్రవేశిస్తుంటేనే జనం ఘొల్లున నవ్వేవారు.  అంతటి హాస్యనటులు దేవాంగి కామిక్ చేస్తుంటే జనం నవ్వులకు తెరవుండేదికాదు.

19. అప్పుల వీరవెంకటజొగయ్యశాస్త్రిగారు.

       వెదురుపాక.  వీరుకేరక్టర్ ఏక్టరు.  ఏపాత్రవేసినా ఆపాత్రలో జీవించడం, సెహబాష్ అనిపించుకోవడం వీరిప్రత్యేకత చింతామణిలో భవానీశంకరుడు, పద్మవ్యూహంలో దుర్యోధనును, వరవిక్రయంలో సింగరాజులింగరాజు, ప్రతాపరుద్రీయంలో యుగంధరుడు చాలాసహజంగా వేసేవారు.  అందులో ముఖ్యగా సింగరాజు లింగరాజు పాత్రేకు మరొకరు సాటిలేరు.  యుగంధరుడుగా ఆయన నటన రంగస్థలికి కలితురాయి.

20. కొవ్వూరి సత్యనారాయణరెడ్దిగారు.

    వెధురుపాక.  వీరు ఆడ, మగ అనేవివక్షలేకుండా అన్నివేషాలూ వేసి జనాన్ని మెప్పించేవారు.  రంగూన్ రౌడీలో ప్రభావతి, చింతామణిలో చింతామణి, గయోపాఖ్యానంలో గయుడు, పాదుకాపట్టాభిషేకంలో విజయరామరాజు యిలా ఎన్నో నాటకాలు, ఎన్నో ప్రదర్శనలిచ్చిన మేటినటులు.  నిజమైన కళాసేవకులు. సుమధురగాత్రం - సుందర విగ్రహం - తేటమాట - జానపదులహృదయాలలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న నటులు.