పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/394

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14. కలపర్రు వెంకటేశ్వర్లుగారు

   ఏలూరు. చింతామణిలో భవానీశంకరుడు, హరిశ్చంద్రలో నక్షత్రకుడు, గయోపాఖ్యానంలో కృష్ణుడు వేషాలలో తన గాన మాధుర్యంతో ప్రజల హృదయలలో శాశ్వతంగా నిలిచిపోయారు.  అందరూ వీరిది గాంధర్వగానం అనేవారు.
    ఈ గ్రంధరచయిత ఆంధ్రదేశంలో అనేకచోట్ల భవానీశంకరుడు, నక్షత్రకుడు వేషాలు వేసినప్పుడు ప్రేక్షకులు అభినందించడానికి వచ్చి మళ్ళా కలపర్రునుచూస్తున్న ఆనందంకలుగుతోందనేవారు.

15.కర్రి విశ్వనాధరెడ్డిగారు.

     కొంకుదురు.  అందమైనవిగ్రహం, తేనెలూరే మధురగాత్రం. సారంగధరలో సారంగధరుడు, భక్తకుచేలలో కుచేలుడు, గయోపాఖ్యానంలో కృష్ణుడు, చింతామణిలో బిల్వమంగళుడు, పాదుకాపట్టాభిషేకంలో రాముడు ఇలా ఎన్నో వేషాలువేశారు.  ఏవేషంవేసినా సరిగా నప్పేవారు.  సహజనటులు, కుచేలుడుగా ఆయనతో ఎవ్వరూ పోటీలేదనిపించేది.  తను ఎంతోమంది నటులకు తర్ఫీదుఇచ్చి తయారుచేశారు.  వారిలో యీరచయిత ఒకరు.

16. సంపదనగరం లక్ష్మణరావుగారు.

     వీరిది రాజానగరందగ్గర సమప్దనగరం.  రామాంజనేయయుద్దంలో ఆంజనేయునిగా యీయన నటన పాట అద్భుతం.  6 1/2 శృతిలో తారస్థాయిలో అన్నిపద్యాలూ అలుపులెకుండా పాడేస్తారు.  ఇది అనితర సాధ్యం. వీరి నాటకంఅంటే జనం తండోపతండాలుగా వచ్చిచూస్తారు.  బేతా వెంకట్రావుగారి శిష్యుడు - గువువునుమించిన శిష్యుడయిన నటుడు.

17. కె. తలుపులరావుగారు.

     మకాం రామచంద్రాపురం.  చింతామణిలో భవానీశంకరుడు, పధ్మవ్యూహంలో అభిమన్యుడు, హరిశ్చంద్రలో నక్షత్రకుడు, రంగూన్ రౌడీలో రోడీ ఆయనకు పేరుతెచ్చిన పాత్రలు.  పద్యాన్ని చక్కగా విరిచి చదవడం, రాగాన్ని ఆధునికంగా మలిచ్ పాడడం యీయన ప్రత్యే