పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/390

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బట్టి చంపకలమే!" ఇలాగ తగువులొచ్చినపుడు జానపదుల
బావామరదుల దెప్పుళ్ళు, వెటకారాలు, వెక్కిరింపులు,
హేళనలు ఎలాఉంటాయా సరిగ్గా అలా చిత్రంచడంతో యీ
నాటకంలోని సంవాదాలూ, పద్యాలూ జానపదులలో బాగా
నాటుకుపోయాయి.

  కృష్ణుడికి మీసాలుంటాయా అనే మీమాంస యీనాటకంలోనే వచ్చింది.  బెల్లంకొండ సుబ్బారావ్గారు మీసాలతోనే కృష్ణుడువేషం వెయ్యడంతో. ఆమధ్య ఒక ప్రదర్శనలో గయుడు వేషధారి "పాతాళమునకేగి బ్రత్రుకవచ్చునటన్న" అనే పద్యం  చదువుతూ చెయ్యిపైకెత్తి చూపిస్తుంటే "అదేంటండి అలా చూపిస్తాడు పాతాళం పైనున్నట్లు!" అన్నారట శ్రీ వాత్సవగారు.  "పాతాళం తెలుగునాటాకరంగానికిపైనే ఉంది గనుక" అన్నారట శ్రీ శ్రీగారు.  'పంపు మామ ', "భయుడా గయమువలదు ' వంటి సాహిత్య చెణుకులు కూడా యీనాటకంనుండి వెలువడ్డవే.  జానపదుల్ని ఆకట్టుకున్న తీరుచూసి (పురాణాల్లో లేకపోయినా) యిదే మూసలో రామాంజనేయ యుద్దం నాటకంగా వడం, ప్రజలు ఆహా! అని చప్పట్లుకొట్టే బభ్రువాహన లోని యుద్ధసీను కూడా దీనికి అనుకరణే కావడం దీని గొప్పతనానికి నిదర్శనం.
   *ఇంతకీ గయోపాఖ్యానం నాటకం ఎదెండ్లగోపయ్య అనే పూర్వ కవి కావ్యం ఆధారంగా వ్రాయబడినదని "తెలుగు పౌరాణిక నాటకాలు" వ్యాసంలో శ్రీ ఎ. శ్రీరామమూర్తిగారు వ్రాశారు.
      గోదావరిసీమలో ప్రసిద్ధులైన పౌరాణిక నటులు
   ఈపాంతంలో పల్లెసీమల్లోకి ప్రవేసిస్తుంటే పొలాల్లోనుంచి "చెల్లియో చెల్లకో", "అలుగుటయే యెరుంగని," "జెండాపైకపిరాజు" అంటూ పద్యాలు వినిపిస్తుంటాయి చల్లబాటువేళ. విద్యాగంధం లేని పశువులుకాచే పిల్లవాళ్ళకుకూడా యివి నోటబడి ఆలపింపజేస్తున్నాయంటే జానపదులలో యీనాటకంమీద మక్కువకి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలి? ఆనాటకం కురుక్షేత్రం* చింతామణి, హరిశ్చంద్ర, గయో

  • సమాలోచన పత్రిక. 1-5-86 పు.6