పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/385

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కృష్ణుడు సూర్యోదయాన్ని వర్ణిస్తూ -
"అబ్జహితుడను కారాగృహదికారి
  కిరణమను తాళ పుం జేతకీలెదల్చి
  దశములను తలుపులను తీయ వెలికి వచ్చు
  తుమ్మదలు తమ్మి చెఱనుండి దొగలట్లు."
  అంటారు.

  ఇది కాళిదాసు ప్రయోగమే అయినా రమ్యంగా సందర్భశుద్దితో చక్కగా అనువదించి చూపేరు.  సాత్యకి చంద్రాస్తమయ, సూర్యోదయాల్ని వివరిస్తూ కలువలను పద్మాలను గుఱించి అర్దాంతర వ్యాసంలో యిలా అంటాడు.

"ఒక్కచో పుట్టి పెరుగుచునున్న వయ్యు
  ఒండొరుల పాడల్కిట్టకయున్న నకట!
  కలువ పూల్దమ్మి పూవులు, కాలవశత
  జ్ఞాతి విఅరముండను పుష్పజాతికైన."

   తెల్లవారు జామున పిట్టల అరుపుల్ని కృష్ణుడు పోల్సిన తీరు మరీ అందంగా ఉంటుంది.  "కమల బాంధవ్డను పుత్రు కనడు వేళ, తూర్పు దిక్కను చూలాలి దుస్సహంపు, ప్రసవ వేద్నగతి వినబడెడు చెవికి, గుములు గూడి కూసేడి పులుంగులేలుంగు" అని. కధలో అన్నిరసాలూ కూడా పుష్ఠిగా పోషింపబడ్డాయి.  కౌశికుడు హంసపదికను మేల్కొలు పుటకు చేసిన ప్రయత్నంలో "పోయి హంశపదిక చెట్లు మేల్కొలుపుదునని ఇంచుక విచారించి ఆమెమంచంక్రిందదూరి కుక్కమొఱిగినట్లు మొఱుగనారంభించితిని.  ఆమెయు అదరిపడిలేచి రెండు మూడ్ నిముషములాలోచించి, మంచంక్రింద మొఱుగుచున్నది కుక్కకాదని నిజముగ్రహించి ప్రక్కనున్న బెత్తమునుపుచ్చుకొని నాకు నాలుగు వాతలు తగ్ఫులనిచ్చెను.  అప్పుడు "నేను కుక్కనుగానే, కొట్టకే, కొట్టకే ' అని మొఱుగుట మాని మొఱపెట్టితిని.  అప్పుడది "చీ - నీవు కుఇక్కవే - మాటలునేర్చినక్కువుసుమీ అని తన పనిని రెట్టించెను.  అంతట నేను దెబ్బలుతినలేక యివతలకువచ్చి గోళ్ళతోదానిజడలు బరికి పండ్లతో దానిబుగ్గలుకొరికి ప్రాణములు దక్కించుకుని యీవతల బడిగిని" అంటాడు.  సరసం మోటుగాఉన్నా హాస్యశృంగారాలకిది ఆటపట్టు, జానపదులకవ్వించే రసపట్టు.