పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/384

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విన్న గయుడు తనను రక్షించమని బ్రహ్మదగ్గరికి వెళతాడు. విష్ణువు గర్భంనుంచి పుట్టినవాణ్ణీనేను. ఈ విషయంలో సాయంచెయ్యలేనంటాడు. గయుడు ఎక్కడా ఆశ్రయందొరక్కతిరుగుతుంటే నారదుడు కనుపించి ద్వైతవనంలోవున్న అర్జునుడు ఒక్కడే నిన్ను కావగలడని చెప్పి ముందు అసలు విషంచెప్పకుండా శరణు వేడమనీ, అభయమిచ్చిన తరువాత అసలు సంగతిచెప్పమనీ ఉపదేశిస్తాడు. ఆప్రకారం అర్జుని శరణువేడడం, అర్జునుడు అభయమివ్వడం, కృష్ణునికితెలిసి అతినిని విడిచిపట్టమని సుభద్రను పంపడం, అర్ఝునుడు నిరాకరించడం, కృష్ణార్జునయుద్ధం, శివుడువచ్చి వారివారి ఒప్పుతప్పులుచెప్పి గయుడుకూడా వారిభక్తబృందంలోనివాడేఅని విశదపరిచి రాజీ చెయ్యడం కధాంశం.

   ఇందులో నాటకీయతంతా కృష్ణునిశపధం, దానికి శివుడుచెప్పిన నిర్వచనంమీదే యిది -

"ఈ విధి నద్దురాత్ము నదియింపక పోవుదునేని
  దేవకీ పుణ్యమూర్తి వసుదేవునకున్ తనయుండ గానికన్
  ధీవినుత ప్రభావులగు దేవరకే ననుజుండ గానికన్
  పావనమైన యట్టి యదు వంశమునన్ జనియింప లేదికన్".
   

ఈ ప్రతిజ్ఞకు ఆఖరున పరమేశ్వరుడు కృష్ణా! నువ్వు నిజంగా దేవకీవసుదేవుల పుత్రుడవుకావు, స్యయంభుడివి. బలరాముడు నీకు సోదరుడేమిటి? నీ పాన్పుగాని -(ఆదిశేషువు) వీళ్ళు నిజంగా యాదవులా! దేవతలుగాని -కనుక, నీమాటాలు పొల్లుకాలేదని విడమర్చి చెబుతాడు.

ఇకకవితాచాయలకొస్తే అందమైన అలంకారప్రయోగాలు ఎన్నో కనిపిసాయి. నాందిలో సూత్రధారుడు ప్రదర్శనలోనిమంచిచెడ్డలు గురించి యిలా అంటాడు.

"నిండు దివ్వెలతోడ క్రీనీడలట్లు
  అలరుగురి వెంజపూసల నలుపులట్లు
  ఘుణగణముతోడ దోషముల్గూడి యుండు
  ప్రాజ్ఞలుక్షమింతురితరులు వరిహిసింత్రు"