పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/374

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"నీవడుగుకొనిన నలుబదిదినములు నేటితో తీరుచున్నవి. ఇంతదనుక నీవు నాకిచ్చిన దొక్కకాసైనాలేదు" అంటాడు. మాసము అంటే 30 రోజులేగా! అప్పుడే 40వ రోజుకూడా దాటిపోతోందే! మరి మాటతప్పినట్టేగా! ఒకవేళ పుస్తకంలో నలుబదిదినములు అనేది అచ్చుతప్పు అయితే సరిచేసుకుని మాట్లాడాలి. లేకుంటే హరిశ్చంద్రుడు తననోటచెప్పిన మాసం గడువు దాటిపోయి మాటతప్పినట్లవుతుంది. ఇది నాటక లక్ష్యానికిభంగం.

                           హ రి శ్చం ద్ర పా త్ర
       విశ్వామిత్రుడు మాతంగాంగనల పరిణయమాడనున్నప్పుడు హరిశ్చంద్రుడు తన ప్రాయమునుగూర్చి "వయ! పరిపాకము తప్పుచున్న యది" అంటాడు.  దీనివల్ల ఇతడు వయసుమీరినవాడే అని తెలుస్తుంది.  అటువంటప్పుడు కుర్రవాడిలాకనిపించే పిల్లవాళ్ళూ, రాచఠీవి బొత్తిగాలేని బక్కవాళ్ళూ, పొట్టివాళ్ళూ, ఈ పాత్రనిర్వహణకు సిద్ధపడడం మంచిది కాదు.
    హరిశ్చంద్రుడు సుక్సత్రియుడు - మహోదారుడు - ధీరోదాత్తుడు.  తన స్కలాంబోధి పరీతభూవలయమెల్ల "భావంబందొక శంకలేకొనగతిన్ బ్రహ్మార్పణంబంచు" అని తృణప్రాయంగా దానంచేసిన త్యాగి  ఈ పాత్రధరించేవారు యీవిషయం గ్రహించాలి.  తన భోగభాగ్యాలొపోయినందుకు "శ్రేయోబందుర సార్వభౌమవద విశ్లేషంబు ప్రాప్తించె బో" మొదలగు అనేకపద్యాలదగ్గర విచారిస్తున్నట్లు నటించడం ఆపాత్రకు అవమానం.  అంతకంటే దారుణం భార్యనమ్మినతరువాత. విడిపోయటప్పుడు భోరుమని ఏడవడం, "కొడుకా కష్ఠములెన్నివచ్చినను" పద్యంల్ పాడుతూ కన్నీరుకార్చడం.  ఈ ఏడ్పులు చూస్తుంటే గొప్పకి రాజ్యం యివ్వడమెందుకు తరువాత ఇలా ఏడవటమెందుకు అనాలనిపిస్తుంది.  కాబట్టి యీ పద్యాల్లోని భావప్రకటన ఎంతోగంభీరంగా చెయ్యవలసివుంది. ఘొల్లుమని ఏడవలసింది తనుకాదు, సామాజికులు అనేది యీ పాత్రధారులు గుర్తించడం అవసరం