పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/373

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వస్తోంది. దానితో అబద్ధంఆడకుంటే అన్నీ అనర్హాలే అనే అపార్ధంవచ్చిచస్తే నిజం చెప్పరాదనేనిశ్చయానికివస్తే అది ప్రేక్షక్లతప్పుకాదు. ఆరుగంటలసేపు ప్రదర్శించే ప్రేక్షకులతప్పు. ఛేంతాడురాగాలతో నాటకాన్ని గానసభగామార్చి కలకంఠి, కాలకౌశికుడు, శిష్యులు, వీరబాహుడు పాత్రలు విశేషంగాపెంచేసి సాగదీసి లాగేసరికి అనవసరంగా నాటకం రెట్టింపై ప్రేక్షకులఓర్పును పరీక్షించి అసలుసందేశఘట్టంసమయానికి అందరూలేచిపోవడం యిప్పుడు జరుగుతున్న సంగరి.

                      అ బ ద్దాం కం
   తృతీయాంకంలో హరిశ్చంద్రుడు అరణ్యానికి వేటకువచ్చినపుడు నేటిప్రదర్శకులు మాతంగకన్య నొకదానిని8 ప్రవేశపెడతారు.  ఆమె జయమాలినిలా సెక్సీగా నృత్యంచేస్తూ ఆడి, పాడి హరిశ్చంద్రుణ్ణి త్ననను పెళ్ళాడమనికోరగా అతడు నిరాకరిస్తాడు.  దానికామె కోపించి తండ్రియైన విశ్వామిత్రుని తీసుకువస్తుంది. విశ్వామిత్రుడామను పెండ్లాడమనగా హరిశ్చంద్రుదు "సీగ్గేలాగునలేపోయె తనకున్" అనెపధ్యంలో"ఎగ్గూహింపక మాలకన్నియల దోయింబొంది అర్కాన్వయం బగ్గిదోసె నటంచుచీయనరె నన్నాబాలగొపాలమున్" అంటాడు.  ఇక్కడ "మాలకన్నియలదోయిం" అంటే ఇద్దరు మాలకన్నియలు అని అర్ధం.  ఎదురుగా ఒకతేవుంటే హరిశ్చంద్రుడు ఇద్దరనడం అబద్దానికి ప్రత్యక్షసక్ష్యంకాదా? బలిజేపల్లివారు వ్రాసినది మాతంగాంగనలు ఇద్దరే.  అందుకే"దోయిం" అని వ్రశారు.  ధనాభావంవల్లో, నటీమణుల కొరతవల్లో ప్రదర్శకులు ఒక్కతెనే ప్రవేశపెట్టిఆ పధ్యం మార్చకుండా హరిశ్చంద్రునిచేత అలాగే చదివించిఆదిలోనే ఆపాత్రనోట అబద్దంపలికించడం అన్యాయం. ఇక్కద దీనితోనే విశ్వామిత్రుడు నెగ్గేస్తున్నాడు. ఇక మిగిలిననాటకం అనవసరం.  అందువల్ల ఇది సరిచేసుకోవాలి.
    ఇక ఇదే అంకంలో విశ్వామిత్రునికీయవలసిన సొమ్ము విషయంలో హరిశ్చంద్రుడు "ఒక్కమాసంబు గడువొసంగిన నేపాటుననైనంబడిమీ సొమ్ము చెల్లించెదను" అంటాడు.  అప్పుడు విశ్వామిత్రుడుకూడా సిష్యునితో "నక్షత్రకా! ఈతడు మనకీయవలసిన రొక్కము నెలదినములలోనిచ్చునట" అంటాడు.  కాని కాశీనులో నక్షత్రకుడు హరిశ్చంద్రునితో