పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/372

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జానపదుల అభిమాన నాటకాలు

           సహజంగా జానపదులు అభిమానించే పద్యనాటకాలే.  అందులో ముఖ్యంగా హరిశ్చంద్ర, చింతామణి, గయోపాఖ్యానం నాటకాలవల్ల వీరి అనురాగం అపరిమితం.  ఈ అనురాగాన్ని అసరాగాతీసుకుని ప్రదర్శకులుచేసే తప్పులు అనంతంగా పెరిగిపోతున్నాయి.  ఈ నాటికాలు జానపదులకు ప్రీతిపాత్రములుగనుక యీ ప్రదర్శనలుకూడా పరామర్శించడం సముచితం.
             హ రి చ్చం ద్ర నా ట కం
          తెలుగునాటకాలలో లక్షలాదిప్రతులు అమ్ముడుపోయి, వేలాది ప్రదర్శనలుపొందిననాటకం బలిజేపల్లివారి హరిశ్చంద్ర, పుట్టిననాటినుంది నేటివరకూ మకుటాయమానంగా విరాజిల్లుతున్న యీనాటకం పట్టుకొనని నాటకసమాజంల్?ఏదు- ప్రదర్శింపబడని వూరూలేదు- చూడని జానపదుడూ లేడు. ఆదర్శాలపట్ల జానపదులకున్న మక్కువ చాలాఎక్కువ.  జానపద హృదయం కరుణరసానికి ఇట్టే కరిగిపోతుంది.  ఇది ఈ నాటకానికి జీవం.
     కాని యీనాటిహరిశ్చంద్రేప్రదర్శనలు చూస్తుంటే నాటకం సత్యప్రబోధానికా అసత్యప్రబోదానికా అనేప్రశ్న ఉదయిస్తోంది.  అసలే నాటకం పెద్దని.  ప్రదర్శన నాలుగుగంటలు పడుతుంది.  దీనికితోడు కొదరునటులుతాలూకు స్పషల్సు జోడించగానే అది ఆరుగంటలకు చేరుతుంది.  దానితో ప్రేక్షకులు హరిశ్చంద్రడి రాజభోగం, రాజ్యదానం, అడవిలోకష్టాలు,  కాశీలో అమ్మకం అయిపోగానే  లేచిపోతున్నారు నిద్రకు ఆగలేక.  ఇక్కదివరకూ కనబడేవి సత్యానికిపట్టిన కష్టాలే  గనుక యీతరం జనంసర్యపాలన అరిష్టదాయకమనే విపరీతధోరణిలోఫడే ప్రమాదముంది.  నిజానికి "సత్యమేవజయతే" అనేసందేశంనాటకాంతందాకాకూర్చున్న వాళ్ళకే అందుతుంది.  సత్యనిష్ఠాగరిష్ఠుడైన హరిశ్చంద్రునికి విదిపోయిన విశ్వామిత్రుడు తనుసంఫాదించుకున్న యావత్ తప: ఫలం ధారబోయడం, శాశ్వతకీర్తిని ప్రసాదించడం, పార్వతీపరమేశ్వరులుదర్శనమిచ్చి దీవించడం వంటి సత్యపాలన సత్పలితాలు జనం చూడకుండా వెళ్ళిఫోవలసి