పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/368

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కూకున్నానండి. సాయిబ్బంట్రోతొచ్చి సాగదీని నాలుగుచ్చుకున్నాడండి - చెంపమీద లెంపకాయలు. చేతిదెబ్బలుగనుక పరువుదక్కిందనుకున్నాను - చెప్పుదెబ్బలైతే చెప్పుకునేదేవుందండీ! నాకు నలుగురు కొడుకులండి. పెద్దోడు పెద్దప్;ఓకిరోడండి. రెండోవాడుకొంచెం అక్కడ కొచ్చేడంది. ఆడు శివలింగానికి గొప్పగా పూజ్జేత్తాడండి. ఆడిపూజంటే అభిషేకమేనండి. ఆడు లింగపూజసేత్తుంటే పీటం గజగజలాడిపోవలసిందే.

   దేవతలకి మేం అంగోత్రంయిచ్చానండి.  అందుకే మమ్మల్ని ద్రేవాంగులన్నరండి.  మాకులం బలేకులవండి.  కొంచెంయామద్దే మెతకతనం వచ్చిందనుకోండి.  మొగోళ్ళేమో తాగుబోతులయిపోతున్నారండి - అడోళ్ళేమోబాబయ్యా ఏరుపిడకలకెళ్ళి ఎత్తిపెట్టించుకుంటున్నారండి.  మరేంలేదుబాబయ్యా తట్టనెత్తిమీదకండి."
  ఇలారెండర్ధాలువచ్చేలా మాటాడుతుంటే జనం పగలబడి నవ్వుతుండేవారు. ఈ వెషం కొంకుదురు మంత్రిప్రగడ రామదాసుమెష్టార్ అద్భుతంగా వేసేవారు.  నవ్వలేక కడుపు చెక్కలయిపోయేది.
            కా లి కి ము త్తుం వే షం
   కాలికిముత్తుం కోమట్లకుర్రాడు.  అతనిఅమాయకత్వంలో గడుసు మాటలు, అతితెలివి, పిసినితనం హాస్యాన్ని కలిగిస్తాయి. ఒకరోజు సాయంత్రం బటానీలుతింటూ రోడ్డునవెళుతుంటాడు.  అతనికూడావస్తున్న స్నేహితుడు తనక్కూడా కొంచెంపెట్టమంటాడు.  ఊహం నేపెట్టనంటాడు.  అయితేకూడారనంటాడాస్నేహితుడు.  పోతేపో అంటాడు కొలికిముత్తుం. దారిలోదెయ్యముందని బెదిరిస్తాడు.  దెయ్యముంటే నాకేంబయ్యువా? నేనుమాత్రం నీకొక్కగింజకూడా పెట్టనంటాడు.  స్నేహితుడు వెనక్కి వెళ్ళిపోతాడు. కొంతదూరంవచ్చాక నిర్మానుష్యంగా ఉన్నచోట వెనకనుంచి దెయ్యమొచ్చి మీదపడుతుంది.  కొలికిముత్తుం వెనక్కిచూడకుండా స్నేహితుడేఅనుకొని ఫో అవతలికి - దెయ్యవంటే నాకేం బయ్యంలేదని వెనక్కి చూసి బేరమంటాడు.  దెయ్యంఫ్వదిలెసి పోతుంది. స్నేహితుడొచ్చి చూసి ఏరా ఏడుస్తున్నావంటే ఉట్టినే సరదాకని గుట్టు చెప్ప