పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/367

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముఖాన విభూతిరేఖలుధరించి, భుజాన చిన్నబట్టలమూట, చేతిలో గజం బద్దతోవచ్చి తనవృత్తిగురించి, తనకులంగురించి, తనగురించి ఏకపాత్రాభినయంతో యిలాచెప్పేవాడు. "ఆయ్ చీరలు, పంచిల సాపులు, జాకెట్టుగుడ్డలు, దుప్పట్లోయ్" అని కేకతోప్రవేశించి జనందృష్టిని తన వైపు మళ్ళించుకుని చెప్పడం ప్రారంభించేవాడు.

    "అంగనా జంగనా లింగనా దేవాంగనా అన్నారండి. పెంచించి పెద్దాపురవండి - ఉనికి ఉప్పాడండి - కాపరం దోరఊడండి.  నాపని తనం చెప్పమంటారాండి? ఓసారి సొంతంగా నేనే నేసేనండి కాశ్మీరుశాలువా.  కాకినాడ పట్టుకెళ్ళేనండి.  కళ్ళుజిగేలుమని చూడలేకపోయారండి.  ఏలూరు పట్టుకెళ్ళానంది. ఇలువులేదన్నారండి.  అంటే ఆదివాసిరకం అనికాదుసుమండీ - దానిపనితనానికి  ఖరీదు కట్టలేవని.  నాఎదురు నేతలో ఉందండి నామజాకా.  గుంటకాడకూకుంటే బట్టయ్యేదాకా లెగవనండి.  ఇప్పుడు సీమపోగునూలొచ్చిందగ్గరనుంచీ పలకమీదదట్టింపు పోయిందంది.  అందుకనిబాబయ్యా! మాయింటగొయ్యి మాత్యమ్ముడికొప్పజెప్పేసి ఊళ్ళమీదికి లంకించుకున్నానండి బట్టలేపారానికి.  బాబయ్యా! మాఇంటిగొయ్యంటే ఏదన్నాఅనుకునేరు - మగ్గంగొయ్యండి.  ఇలా ఊళ్ళమీద పడి లంకించుకుంటే పంచిల్లో మాలావుగా వొచ్చిందండి.  ఆపంచిల్లో వొచ్చింది చీరల్లోదూరిందండి. దాన్ని కూడదీసుకోవడానికి మళ్ళీ జాకెట్టుల్లో లాగాల్చొచ్చిందందడి.  ఈ బట్టలమ్మకాల్లో ఓరోజు బిక్కోల్లోపొద్దోయిందండి. ఉందిపాదావా అనుకున్నానండి - నాకక్కడో కాతావుందిలెండి. చీరలూ జాకెట్లూ నేనేయిత్తానండిఆరికి వతనగా.  తీరాఎల్తే ఆవిడ ఆళ్ళబావగారొచ్చారుకాళీలేదందండి.  ఆవిడిదిఒక్కటే గదండి. మరింకేంచెయ్యను? ఆఅర్ధరాత్రి బయల్దేరి పెద్దకత్తిమొల్లోదోపుకుని దోరపూడి బయ్హల్దేరేనండియింటికి.  అసలే అది అర్ధరాత్రి చూస్తే దొంగలరోడ్దు. ఆపైనచిమ్మచీకటి.  అనవర్తిదాటాక ఒకదొంగ తలకితెల్లటిగుడ్డ చుట్టుకుఇ దారిప్రక్కనకాసుక్కూకున్నాడండి.  ఏవిటీ? కత్తి! కత్తిరెండుముక్కలవ్వడమేవిటనుకుంటున్నారా? అది మనిషయితేగా! మైలురాయండి.  ఓసారండి ఎంబెళ్ళ నరసింగరావుపంతులుగారు తాసిల్దారుగ్గా వచ్చేరంది.  అప్పుడు నేను నూరుమగ్గాలకు సేనాఅతినండి - అందుకని అరిసరసికెళ్ళి