పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/366

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రంగానికీ రంగానికీ మధ్య నాటకానికి సంబంధంలేని కొన్ని కామిక్ వేషాలువచ్చి చమత్కారమైనహాస్యాన్ని అందిస్తూ నవ్వింఇవెళ్ళేవి. నిజానికి ఈ వేషాలుకూడా జనాన్ని బాగా ఆకట్టుకొనేవి. అలాగే సీనుకీ సీనుకీ మధ్య "ఇంటర్ వెల్ సాంగ్సు" అని తెరలో "నెరానెర నెర బండి", "చల్ మోహనరంగా", "గుత్తివంకాయ కూరోయిబావ" లాంటి పాటలు పాడి జనానికి విసుగులేకుండా చేసేవారు. నేటి వీధినాటకాల పద్యాల దీర్ఘరాగాలాపనపద్ధతి యిక్కడినుండే ప్రారంభమయింది. ఇది మరే భాషలోనూ లేదు.

  ఇలా వికసించిన వీధినాటకం అబ్బూరి, షణ్ముఖుల ప్రవేశంతో హాలులోకిచేరి, క్రమంగా కంట్రాక్టర్లచేతుల్లో చితికి, మరల దేవుళ్ళ పుణ్యమాఅని గణపతిరాత్రి పందిళ్లలోనూ, దేవీనవరాత్రి పందిళ్ళలోనూ శ్రీరామనవమి పందిళ్ళలోనూ దర్శనమిస్తోంది.  ఇప్పుడు మరల నడిరోడ్దుమీద 16 ఎం. ఎం. సినిమాదెబ్బకి దిక్కుతోచక బక్కచిక్కి కుక్కిమంచం ఎక్కబోతోంది.  ప్రభుత్వం వెంటనే యీనడిరోడ్దుమీద సినీమాను అరికట్టకుంటే కొద్దికాలానికి ఈ సంపద అవశేషాలుకూడా నశించిపోయే ప్రమాదం ఉంది.
                 కా మి క్ వే షా లు
 మొదట కూచిపూడివారి యక్షగానాలలో అవాంతరవేషాలపేరుమీద యివి కనిపించేవి.  కూచిపూడివారు పగటివేషాలు కొన్నింటిని కధకుసందర్భం లేకపోయినా రంజకత్వంకోసం ఘటానికీ, ఘట్టానికీ మధ్య ప్రవేశపెట్టేవారు.  అవి గొల్లభాయుడు - గురువు, దేవాంగి, ఫకీరు, బుడబుక్కల, బైరాగి, జంగం, వైష్ణవ గురువు - శిష్యుడు, లింగబల్లి, కోమటి మొదలగు వేషాలు. క్రమంగా అప్రక్రియ 'కామిక్ ' ల పేరుతో వీధినాటకాల లోకికూడా ప్రాకింది.  సీనుకిసీనుకీమధ్య విరామంలో ప్రెక్షకుల్కు విసుకుగలగకుండా యీపాత్రలు జోకర్ రూపంలోనో, వెర్రిగొల్లవేషంలోనో, శ్రోత్రియబ్రాహ్మణ వేషంలోనో, మరోరూపంలోనో ప్రవేశించి హాస్యప్రధానంగా నడిచి కడుపుబ్బనవ్వించేవి.  వీనిలో కామిక్ సుప్రసిద్ధం.
                     దే వాం గ వే షం
      అంగవస్త్రంకట్ట్లుకుని, తలకు రుమాలుచుట్టుకుని, మెడలో లింగకాయ