పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/365

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బంగారుబొమ్మా" అనే పాట వ్యాప్తిలో ఉండేది. ఆరోజుల్లో యిందుకోసం నల్లమిల్లి రామిరెడ్దిగారు "పాండవవనవాసం". నల్లమిల్లి బసివిరెడ్డి గారు "భక్తరామదాసు", "భక్తప్రహ్లాద" వంటి ఎన్నో భజననాటకాలు వ్రాశారు. కొంకుదులో కొవ్వూరి చినసూరన్న గారు కుర్రవాళ్ళను ఊరూరా తీసికెళ్ళి వేయించేవారు. శ్రీ కర్రి విశ్వనాధ రెడ్డి రాముడుగా శ్రీ పడాల రామిరెడ్డి (మిరపకాయల రామిరెడ్డి) లక్ష్మమణుగా వేషాలుచూసి ప్రేమించి ధనవంతులపిల్లలు వాళ్ళను పెళ్ళిచేసుకున్నారు.

                        చం పూ నా ట కా లు
       ఇక్కడివరకూ రంగస్థలానికి బల్లలుఏర్పాటులేదు.  చాపలూ, నరకాలే క్రిందవేసి ఆడేవారు.  ఆ తరువాత మాదిగభాగవతులనే సంచార దళం చంపూనాటకాలు మొదలుపెట్టారు.
     వీరినాటకానికి చిన్న పందిరివేసి, పందిట్లో బల్లలు వేసి, స్టేజికట్తి, మొందొకతెర, వెనకొకతెర వ్రేలాడదీసి పెట్రోకాక్సులైట్ల వెలుతురులో ఆడేవారు.  వీరి " శశిరేఖాపరిణయం" ప్రదర్శన గొప్పగా ప్రశంసలు పొందింది.
                 ఎ ర్ర గొ ల్ల ల నా ట కా లు
 ఆతర్వాత పల్లెప్రాంతాలలో వీధినాటకాలకు ఒకఊపు తెచ్చినవారు ఎర్రగొల్లలు. వీరిలో పౌరాణికనాటకరంగం  ఊరూరా పరవళ్ళు త్రొక్కింది. కృష్ణలీలలు, కనకతార, కాంతామతి, జయంతజయపాల, గయోపాఖ్యానం, ఉద్యోగవిజయాలు వగైరా నాటకాలు వీరు ప్రదర్శించేవారు.  ఈ ఎర్రగొల్లలట్రూపులో కర్రి అబ్బులు, కంచర్ల వెంకన్న కృష్ణార్జునులుగా వేసే గయోపాఖ్యానంనాటకం ఏవూఊరవేసినా చుట్టుపట్ల పైది, పదిహేనుమైళ్ళదూరంలో ఉన్న ఊళ్ళవారుకూడా వెళ్ళి గడగడవణికించేచలిలో కూడా కూర్చుని కోడికూతవేళవరకూ చూస్తూనేఉండేవారు.  అలాగే వీరి కురుక్షేత్రంకూడా.  వీధినాటకాలు నాలుగువీధులకూడలిలో పెట్టేవారు.  నాలుగువీధులూకూడా జనంనిండిపోతే ముందుతెరా వెనుకతెరాకూడా పూర్తిగా ఎత్తేసిఆడేవారు.  అందుకే ఇప్పుడుకూడా ఎవరయినా తెరలెత్తేసి ఆడుతుంటే "ఎర్రగొల్లలనాటకంలా అదేమిటిరా?" అంటుంటారు.