పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/364

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యా నా ది భా గ వ తు లు

      యానాది భాగవతులను నక్కల భాగవతులనికూడా అనేవారు.  వీరు ప్రశస్తంగావేసేవి 'కచదేవయాని ' 'చెంచు లక్ష్మి ' నాటకాలు. 'చెట్టులెక్కగలవా నరహరి పుట్టలెక్కగలవా ' అనే పాట వీరి చెంచుకలక్ష్మి నాటకంలోనిదే. నృత్యం, పాట, మాట అన్నింటిలో ఈ నాటకం సంపూర్ణమైన జానపద రీతి.  గంగిరెడ్ల మెళాలుకూడా ఈ నాటకాన్ని ప్రదర్శించేవారు.
     యానాది భాగవతంలో స్త్రీ పాత్రలు స్త్రీలెవేస్తారు. పురుషపాత్రలు పురుషులే వేస్తారు.  దాదాపు జట్టులోని వారంతా ఏదో ఒక వాయిదమో, తాళమో, వంతపాటపాడటమో చేస్తారు. ఉషాపరిణయం, కృష్ణలీలలు, సావిత్రి నాటకాలను కూడా వీరుప్రసిద్ధి.  అద్దళం, గంగసింధూరం, కాటుక, దుస్తులు, పూసలదండలు అట్టకిరీటాలు వీరి నాటకాభరణాలు.


                         భ జ న నా ట కా లు
    ఇలాంటి ప్రక్రియలు యింకా పరిశీలిస్తే పల్లెపట్టుల్లో భజన నాటకాలు కనిపిస్తున్నాయి,.
     చిన్నసైజు చిప్పలతాళాలు వాయిస్తూ మధ్యలో వొత్తులు వెలిగీచిన ఇత్తడి "సెమ్మే" పట్టుకుని, దానిచుట్టూ భజనబృందం వర్తులాకారంలో నిలబడిగాని, కూర్చొనిగాని భజనచేస్తుంటారు.  వీరు చేసే సప్తతాళాలభజన అద్బుతంగా వుంటుంది.  వలయంలో వేషాలుధరించిన పాత్రలు సంవాదంగా కీర్తనలుపా'డుతుంటే ఆ బృందం రెండుగా చీలి కొంతమందిఒకపాత్రకూ మరికొంతంది మరోపాత్రకూ వత్తాసుగా పాడుతుంటారు.  వీరు ఏభాగవతులూ కారు.  రాగజ్ఞానంకలిగిన ఉత్సాహవంతులైన గ్రామీణజనులు  భజనజట్టుగాకూడి ఈ నాటకాలు నేర్చుకుని ప్రదర్శించేవారు.  వీటిలొ "లంకాదహనం" ప్రసిద్ధి.  "ఎక్కడివాడవురా! మ్రుక్కడివానర నీవెక్కడివాడవురా?" అని పాడే వీరిరావణ, ఆంజనేయుల సంవాదం ఆ రోజుల్లో పల్లెటూళ్ళల్లో పశువులగాచే పిల్లలదగ్గరనుంచీ పెద్ద వాళ్ళదాకా ప్రతినోటా నానేది.  అలాగే అశోకవనంలో సీతను చూసిన హనుమంతుడు "ఎవ్వారమ్మా చెట్టూక్రింద? ఇటులశోకించానేలమ్మా చెప్పూ