పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/356

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెయ్యగలనని, అన్నాలువండగలనని మంగమ్మ ధీమాగా సమాధాన మిచ్చింది. దానికడు సారెచుట్టూముమ్మారుతిరిగి ముందుకువచ్చి నీసారెలో కరివేపాకులేదు. నీకురావటంలేదన్నాడు. పైగా ఆవూరిలో ఎక్కడా కరివేపాకు లెకుండా లద్దెపురుగై నాకేశారు.

  అప్పుడు మంగమ్మ బ్రాహ్మణవీదికెళ్ళి బ్రాహ్మణక్కల్లారా కొంచెం కరివేపాకు ఇవ్వండంది.  వారుచూసి లద్దెపురుగువచ్చి నాకేసిందని చెప్పారు.  కాపువారివీధి కెళ్ళించి.  అక్కలారా! అమ్మలారా! మీదొడ్లో కరివేపాకు కొంచెంఇస్తారా? అంటే నువ్వు చూసుకో అన్నారు.  కావాలంటే మొగ్గకుమొగ్గే మూసుకుపోయింది. కమ్మరవీధికెళ్ళింది.  కరివేపాకు చెట్లు పుల్లరేగుచెట్లయ్యాయి.  దేవిమంగమ్మ అడవిలో అడ్డపడింది.  నడిచేకాళ్ళకు పుళ్ళుపడ్డాయి. చేతులకు రక్తాలుచిమ్మాయి.  ఎందుకొచ్చినబ్రతుకు నాబ్రతుకుకనుకొంది.  అద్దానపడవిలో ఘొల్లుమంది.  ఆయేడుపు గోవిందరాజులకు వినిపించింది.  భార్య లక్షితో అంటున్నాడు.  "విన్నావాలక్ష్మి! మామరదలు మంగమ్మ సారట్టుకొస్తోంది, నేను ఎదురెళతా" అని బయలుదేరాడు.  అతనిరాకనుచూసిన మంగమ్మ్న "నేను మాబావగారికళ్ళబడను, అమ్మాభూదేవీ! నాకుదారియ్యి" అని ప్రార్ధించింది.  భూమి భళ్ళున లోరుకు బ్రద్దలయింది.  గజం లోతులో మంగకొలువుతీరింది.  పైన గజనిమ్మలు కమ్మేశాయి.  ఆదారిన వెళుతూ గొవిందరాజులు సందుసందులోనూ తొంగిచూశాడు. అప్పుడు కోపంతో మంగమ్మ బావగారితో అంటుంది.  "మీహేళన తమ్ముడికి వెళ్ళెలాచేశారు! అక్కరలెనివాడికి ఎందుకుచేశారు?"  అంటే గొవిందరాజు విని బాధపడి "నాతమ్ముడు వెంకన్న ఏలితేఎంత? ఏలకుంటే ఎంత? నాకూడారావమ్మా! నేనుచూసుకుంటా కన్నకూతురిలా" అన్నాడు.  దానితో మంగమ్మ వెనక లేచివస్తుంటే గోవిందరాజు ముందునడుస్తున్నాడు.  ఉప్పుకొనేరుదగ్గరకువచ్చాడు.  గుడిలోనుంచి లక్ష్మి పరుగెత్తుకొచ్చి మంగను రమ్మనిపిలిచి "నామరిదివెంకన్న ఏలిఎతేఎంద ఏలకుంటేఎంత? కన్నకూతిరిలా చూసుకుంటా" అని కావలించుకుంది.  కాని మంగమ్మ ఎదుకొచ్చినబ్రతుకు నాబ్రతుకని ఉప్పుకోనెట్లో  దబ్బున ఉరికింది.  గంగాదేవిసాపాలు బ్రద్ధలయ్యాయి.  పటాపంచలై పారిపోయాయి.  మొగకెరటమొచ్చిముంఛేసింది.  ఆడకెరట మొచ్చి ముంచేసింది.  ఆడకెరటమొచ్చి పసుపు, కుంకుమ