పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/349

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏమి నిన్ను మామ మాటన్నాడా? అత్తతిట్టిందా? పెద్దన్న గోవిందు ఏమన్నా అన్నాడా? చేతికంకణాలు చేతినెవున్నాయి. నుదుటబాసికం నుదుటనేవుంది. కట్టినబట్టలే విడువలేదు. కారణమేమి"టంది. "కొట్టడానికి తిట్టడానికి వాళ్ళెంత? వారిని నేనే తిప్పికొడతాను,విషయం అదికాదు. నాదగ్గర రొఖ్ఖంలేదు. అందుకవసరంగా నిన్ను తలచా"న్మన్నాడు. దానికి దుర్గ నిన్నగాక మొన్నపెళ్ళయినతమ్ముడు చీరయిస్తాడుకాబోలని నేచూస్తే నువ్వు నన్నెడబ్బులడుగుతున్నావేంటని హాస్యమాడి, యిదెంతభాగ్యమని చెప్పి తెస్తాననివెళ్ళింది. చెన్నపట్నంనుంది ఎడ్లబేరగాళ్ళు వస్తున్నారు. మారుబేరగాళ్ళు కోటప్పకొండకు యెదురుగుండా మందవేశారు. ఆమందచుట్టూ వాళ్ళుపడుకున్నారు. అర్ధరాత్రివేళ నిద్రపొద్దువేళ దుర్గ ఆ మందచుట్టూ తిరిగి మధ్యకువెళ్ళి చేతిలోనివిభూతి గోరెడుచల్లింది. వెన్నుచరిచి మాయమయ్యింది. వెంటనే దూళ్ళనోటికి సలుపులు, కాళ్ళకు గాళ్ళు తగిలాయి. బేరగాళ్ళుచూసి బేరమన్నారు. ఇవి ఎవరెట్టిన జబ్బులని విస్తుపోయారు. ఇంతలో కోటప్పకొండకి ఓగొల్లపిల్ల చల్లలు పెరుగులు అమ్మదెచ్చింది. కోటప్పదేవువు మారువేషంలో చల్లుందా గొల్లపిల్లా అని దరిచేరుతుంటే హడ;లిపోయి ఆపిల్ల మందలోపడింది- కోఫ్టప్ప ఆవేశంపొందింది. అప్పుడు అక్కడివారంతా పసుపునీళ్ళు దిష్ఠితీసి,పచ్చని అక్షతలువేసి, కోటప్పమీద కాసులు ముడుపుకట్టుతుంటే పూనకంలో ఆమెద్వారా కోటప్పచెప్పాడువారికి "పేరిందేవి కొడుకుపేరు వంకన్న, ఏడుకొండలమీద క్రొత్తగావెలిసాడు, వాడికి తెల్లవరగానే పసుపుగుడ్డల్లో పచ్చనిఅక్షతలు, బండెడుకాసులు ముడుపుకట్టండి, దూడలు ఆరోగ్యంగా వుంటాయుఇఅన్నాడు. తెల్లవారగానే వారావిధంగాచేసి వడివడి దండాలు పెట్టుకుంటూ "మామంద అంతా చల్లగావుంటే వచ్చిన లాభం అంతా మీకే అర్పిస్తాం" అని మ్రెక్కి బెజవాడసంతకు తోలుకెళ్ళరు. అమ్మకం కాసులు రాసులుపడుతున్నాయి ఇంతలో ఒకరడు అన్నాడుకదా ఏడుకొండలవాడికిడబ్బెందుకు మూడు రూపాయల అరిటిగల ఇద్దాం, ఆరగిస్తాడు అన్నాడు. అంతే వాళ్ళ అమ్మకాలు చల్లబడ్డాయి. అప్పుడు అందులో పెద్దన్న అన్నాడుకదా "వడ్డీకాసులు తెచ్చి వడ్డీకడతాము, మాలాభాలు నిజంగా మీకే అర్పిస్తాము" అనిమళ్ళీ మ్రొక్కి కాళహస్తి సంతకు తోలుకెళ్ళారు. మళ్ళీ అమ్మకాలు కాసులు రాసులే - వెంటనే ఏడుకొందల వాడిదగ్గరికెళ్ళి అమ్మకంలాభాలు ప్రోగులేసి "నీ మొక్కు నీకిచ్చాము,