పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/347

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రొఖ్ఖం లేదనీం ప్రయత్నించినా దొరకలేదనీ, మీరు కాదూకూడదని పట్టుబడితే నాకున్న పండభూమి ఏబదిఎకరాలు రాసిస్తానన్నాడు. ఆ ఏడుకొండలు కొట్టించి కోనేరు త్రవించి "ఆలంవారి కోనే"రని అనిపిస్తాను, ముందుముందు ముట్టచెబుతాను. ఒప్పుకోమని బ్రతిమాలుతున్నాడు. ఇక పెళ్ళికొచ్చినవాళ్ళు మాకు ఆకళ్ళు వేస్తున్నాయి, దప్పికలెస్తున్నాయి, మీకు కట్నకానుకల పట్టుంటే మాయిళ్ళకు మేము వెళ్ళీపోతామన్నారు. వెంటనే వీదివీధీ తుదిచి విస్తళ్లేశారు. ఇంతలో దేవలోకంనుంచి గోవువచ్చింది. దానికి నాలుగుచన్నుల పొదుగు. అది ఆకాకు సందున నడుస్తూ వస్తుంటే గారెలూ బూరెలూ ఒక చన్ను కురవగా, పంచభక్ష్యాన్నమ్లు మరొకచన్ను కురవగా, చిత్తగార్రివానలాగ, పాలు మజ్జిగలు మరొకచన్ను కురుస్తుంటే అందరూ భోజనాలు సుష్ఠుగాచేసి ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోయారు.

   అన్నమాటప్రకారం కోనేరుత్రవ్వించాడు.  నీళ్ళల్లోపండిన నీవారు ముత్యాలు, ఎద్దుతొక్కనిపంట ఏడు పుట్లు మంగకు వడికట్టుబియ్యం కట్టారు.  పన్నెండు మణుగుల పాతబెల్లం, పన్నేండు మణుగుల పచ్చిపసుపు, పన్నెందు మణుగుల పాతకంద, పన్నేందు మణుగుల పత్తివిత్తనాలు, పాతికి బొండాలు, పన్నెండుకుంచాల పసలు, పన్నేందుకుంచల కందులూ ఒడిగట్టుగు కట్టారు. పన్నెండువందలరూపాయలు ఖరీదు పట్టుచీర పెట్టేరు.  ఒడికట్టుతో మంగను దిగువతిరుపతికి పంపించారు. అక్కడ మూడురోజులుంటారు.
   తరువాత మంగతమ్ముడు సింగకుడు అక్కకి ఒక పల్లకీ, బావకు ఒకపల్లకీ జోదుపల్లకీలు పట్టించుకునివచ్చి తన అక్కాబావలను పంపించమని గోవిందరాజులనడిగాడు.  అతడు పింగళకునికి తలరాసి నీళ్ళోసి పంచలచాపు పెట్టి, తమ్ముడు వెంకన్నను పిలిచి ఆలంవారిపట్నం వెళ్ళమన్నాడు.  ఈ మాటవిన్న వెంకన్న మాటాడకుందా వెళ్ళీపోయాడు.  మరలరాలేదు.  పింగళకుడు అక్కదగ్గరకెళ్ళీ జరిగిందిచెప్పి ఆమనైనా పనయనమై రమ్మన్నాడు.  దానికామె  నాయీడు జోడు వారు నన్నడిగితే నేనేం చెప్పేదని వెక్కివెక్కి ఏడ్చింది.  దీనికి గొవిందరాజు ఓదార్చి, "నీదేవుడు వెంకన్నను నేనుపంపుతాను. నువ్వెళ్లుతల్లీ" అని చెప్పి పంపాడు.  పల్లకీలో మంగమ్మ కూర్చుంది.  మిట్టపల్లాలవద్దకూడా