పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/337

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గొల్లాభామావచ్చె పల్లవీపాణిలో
పల్లెవాడలంట చల్లానమ్ముకుంటూ
గొల్లభామావచ్చేనే" అని చదువు ప్రారంభిస్తాడు.

     గొల్లభామకూడా ఆ దరువునందుకుని నాట్యం చేస్తూ వస్తుంది.  ముందుగా ప్రచారానికి ఆరోజుల్లో అవకాశంలేదుకనుక ఇలా పాత్రపరిచయం అయ్యేది.  ఆ తరువాత ఆ బ్రాహ్మడు, ఆభామ సంబాషిస్తారు.  ఇదంతా వేదాంతమయమే.  కాకుంటేఅపద్యాలూ శ్లోకాలు చదివి సామాన్యులుకుకూడా సులువుగా అర్ధమయ్యేటట్లు ఆవిషయాలను వివరిస్తారు.  ఈ సంభాషణ విప్ర, గొల్లకులాల్లో వ్ఏదిగొప్పది అనేవాదంతొ ప్రారంభమై మతం, సంస్కృతి, ఆచారవ్యవహారాలు, త్రిపురాసురసంహారం, క్షీరసాగరమధనం, పిండోత్పత్తిక్రమం, జీవాత్మ పరమాత్మలఉనికి, పునర్జన్మ, సృష్టి, ప్రళయం వగైరా ఎన్నో విషయాలు వీరి చర్చలో వస్తాయి.  ఆ బ్రాహ్మడే కధనడుపుతూ మధ్యమధ్య విదూషక పాత్రకూడా నిర్వహిస్తారు.  ఇందులో సుంకరి కొండయ్యగారువచ్చిన శ్రీకృష్ణునితో సంవాదము మరో ఘట్టం.  సుంకరికొండ తన ప్రేమను గొల్లభామకు తెలుపగా ఆమె ఆగ్రహిస్తుంది.  ఇంతలో మరో గొల్లభామ వస్తుంది.  వారితో కొంత సంవాదం అయ్యాక సుంకరి కొండ ఆ గొల్లభామలకు స్వస్వరూప దర్శనం యిచ్చి (శ్రీకృష్ణరూపం)వారిని తరింపచేస్తాడు.  నిజానికి యిందలి విషయం సామాన్యుని అవగాహనకు అందనిది.  వినడానికి విసుగు కలిగిస్తుంది కూడా.  కాని వీరా శ్లోకాలూ పద్యాలూ శ్రవణానందంగా చదువుతూ, సరళసుందరంగా విప్పిచెప్పడం నేత్రానందం?!" అభినయిస్తూ చేసే నృత్యం బ్రాహ్మణుడు విదూషకుడిగా విసిరే చెణుకులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించి ఆలోచనలు రేకెత్తించి మనిషినివిజ్ఞనిచేసే అద్భుత కలాపమిది.  ఈ కాలాపాలు తెలుగువారిస్వంతం.  మరెక్కడాలేవు.
                     బో గం మే ళా లు
   తెలుగునాట వివాహారిశుబకార్యాలలోనూ, దేవునిఉత్సవాలలోనూ అనాదిగా భోగంమేళాలు ఆడించడం ఒక వేడుక.