పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/336

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జడ మొదట పాముపడగ వుంటుంది. దానిక్రిందుగా 27 నగరాలను సూచించే 27 బిళ్ళలుంటాయి. దానిచివర మూడుకుప్పెలు- ఆమూడు కుప్పెలకు ఇంకొక మూడుకుప్పెలు -ఆమూడుకుప్పెలకు ఇంకొక మూడు. మొత్తం తొమ్మిది కుప్పెలూ నవగ్రహాల సూచనలు.

 సత్యభామ రాగిణి, చంద్రవంక, సూర్యుడు, మొగలిరేకులు, పాపిడిపిందెలు, కమ్మలు, జూకాలు, దండకడియాలు, ముత్యాలు, పట్టెడ, ఆడ్డబాస, ముక్కుపుడక వగైరానగలతో మెరిసిపోతూ వుంటుంది. ఇవన్నీ కాకీబంగారంతో చేయబడినవే.  ఈ కలాపమంతా శృంగార, హాస్యరస ప్రధానమై ప్రేక్షకులకు గిలిగింతలుపెడుతూ అర్ధరాత్రి ప్రారంభమై తెల్లవార్లూసాగుతుంది.
  *ఆరచనలన్నియు (యక్షగానాదికములు) బామరములనియు, నప్రౌఢములనియు,దోషభూయిష్టములనియు నిపుడువానిసంస్మరణము సైతము మఱిచిపోయితిని.  కావుననే మన వాజ్మయశరీరముననొక పార్శ్వము పక్షవాతపీడితమై చచ్చుపడినదీ.
                 
                          గొ ల్ల క లా పం
    • "గొల్లకలాపం భామాకలాపంలోని భాగమే. ఈ కలాపాన్నికూడా భామాకలాపంతో కలిపేపూర్వం "గోపికా విదూషక వాదరూపం"గా ప్రదర్శిస్తూ వుండేవారు. నవరస కధాభరితంగావుండేకధలో వేదాంతప్రబోధ మెందుకని కాబోలు రసజ్ఞలైనపండితులుకొందరు భామాకలాపంనుండి ఈకధను వేరుచేసి 'గొల్లకలాపం 'గా ప్రచారాంలోకి తెచ్చరు.'
 దీనిలోకూడా కధేమీవుండదు.  ఓ గొల్లభామ చల్లమ్ముకుంటూ వస్తుంటే దారిలో ఒక బ్రాహ్మణుడు తారసిల్లుతాడు.  ఆ బ్రాహ్మడు-

"గొల్లాభామావచ్ఫేనే, చల్లోయని,
  గొల్లాభామావచ్చేనే, పెరుగొయని, గొల్లాభామావచ్చేనే-


=

  • ఆచార్య పింగళి లక్ష్మీకాతంగారు. ద్విపదభారతపీఠిక పు.42
    • విద్వాన్ సహదేవ సూర్యప్రకాశరావు. రూపకళ.పు.31