పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/329

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ అయ్యలరాజు రామభధ్రుడు తన రామాభ్యుదయ కావ్యంలో,
        "జెక్కిణి కురవంజి మేళములు గేళికలు సల్పిరి" అని
       వ్రాసాడు. ఇందులో ఎరుకలసాని ఎరుకచెప్పడం
       ముఖ్యాంశం.
      'ఎందుకో యఱుక యటందు గొరవంజి నటించె నొక్క గురు
      కుచ చంకన్ బురుగు బంగరు చుట్టియు, జొరివిదిన్
      గొల్లాపురమ్మ సుద్దుల వెలయున్ ' -

అని దశావతారచరిత్రలో వ్రాయబడింది. ఇందులో చోడిగాడికలాపం లాగే అనే పాత్రలు, అదే కధ.

*'సింగడు నరసింగడునుంచి ఏర్పదింది '.  ఈ కురవంజిలను విమర్శికులు మూడురకాలుగా విభజించారు.  మొదటిది చెంచులక్ష్మి నరసింహుల ప్రణయగాధనే వర్ణిస్తుంది.  ఇది పూర్తిగా చోడిగాని కలాపమే.  'గరుడాచలమహాత్మ్యం ' దీనికి ఉదాహరణ. రెండవది నాయకుడు ఎరుకత వేషంలోవెళ్ళి నాయకికి ఎరుకచెప్పడం.  ఉదాహరణకు "పార్చ్వతీ పరిణయం"లో పరమేశ్వరుని ఎరుక.  మూడవది కధకి ఏవిధమైనసంబంధం లేకపోయినా ఏదోలాగ ఎరుకసానిని ప్రవేశపెట్టి ఆమెచేత నాయకికి సోదిచెప్పించడం.  ఈ మూడును శృంగారకురవంజిలు.  ఇవిగాక వేతాంత కురవంజిలుకూడావున్నాయి.  ఎఋకాంటే జ్ఞానము అని అర్ధం.  అది సన్నిధిరాజు జగ్గకవి (ఉప్పాడ) వారు వ్రాసిన జీవయరుకుల కురవంజిలో హాస్యగాడూ ఎరుకతా సంవాదంలో యిలా వివవించబడుతుంది. 'అహో! ఎరుకలసానా! ఆదివారముమొదలుకొని శనివారముపర్యంతము ఏడువారేములు వదకిచూచినా ఎరుకవారమనేమాట కనిపించలేదు.  అది ఎలాగువచ్చెనో తెలియజెప్పవలనే పాపా?
   ఆలాగునగాధయా సామీ! ఎరుకలవారమనగా ఎరుకలకులమనే మాట గాదయా - దాని వివరము జెప్పెగాని వినవయా సామీ!

"ఎరుక వారమనగ యెల్లలోకంబుల, రాణివాసులైన రములకును, యెరుకచెప్పునట్టి ఎరుకల కులమయా, యెల్లకులములకును హెచ్చు


  • సురవరం ప్రతాపరెడ్డి గారు. ఆంధ్రుల సాంఘికచరిత్ర. ఆయదవ ప్రకరణం.పు.30-1