పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/328

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చో డి గా డి క లా పం:-

    యక్షగాన ఆవిర్భావం మూలంలోకి వెళితే మొదటగా కనిపించేది చోడిగాడ్ కలాపం.  దీనికి కధ చెంచులక్ష్మి నరసింహులు ప్రణయ, కలహగాధ.  ఈ నృసింహుడు చోడిగాడు - అతడే సింగడు.  చెంచులక్ష్మి, సింగి. కధ నామమాత్రం. ఒకరోజు నిద్రలేచినసింగడికి పక్కలో సింగి కనబడదు.  అతడు ఆమెను వెదకడం, కనిపించకపోవడంతో విరహం, ఆమెచేష్టలుతలచుకొని విలపించడం, దేవతలందరికీ మొక్కి తన సింగిని చూపమని వేడుకోవడం, చంద్రౌపాలంబనాదులు అయ్యాక సింగి వస్తుంది.  సింగడికి ఎంతో సమబరమవుతుంది.  కాని పరువుకోసం పౌరుషంతోసింగిని సాధించబోతాడు.  కాని అది విరసమై, వివాదమై కడకు అలకలుతీరి పొత్తులుకుదిరేసరికి తెల్లవారుతుంది.  ఇందులో కోపు, చింధు దశావరానృత్యం,తాండవం ప్రయోగింపబడతాయి.  తాళంవేసేవారిలో ఒకడు వారిద్దరిమధ్యా పారిపార్శ్వకుడిగా వ్యవహరిస్తాడు.  ఇతడి పేరు కోణంగి.  ఇతడు నాయకి నాయకుల్నిసంధానంచేసేటప్పుడు హాస్యంకోసం కొన్ని కొంటెపనులు చేస్తుంటాడు.  అందుకే 'కొంటెకోణంగి" అని వాడకలోకొచ్చుండొచ్చు. చోడిగాడిచేతిలో వంకరకర్ర ఆహార్యంలో ప్రధానమైనది. "బ్రహ్మకుటిలకం ధధ్యాత్" అని భరతశాస్త్రంలో వ్రాయ బడింది. కుటికలం అంటే వంకరకర్ర.
  • "ఈలుటికలం విదూషకుడిచేతిలో శోబిస్తుందని అభినవగుప్తుడు వ్యాఖ్యానించారు". దీన్నిబట్టి చోడిగాడు హాస్యాన్నికూడా నిర్వహిస్తాడన్నమట.
                        కం ర వం జి లు  
    • "చోడిగాని కలాపపరిణామమే కురవంజి. కురవంజీపదమును ప్రప్రధమంగా కావ్యంలో వాడిన తెలుగుకవి అయ్యలరాజు రామభద్రుడు (1500 - 1580) గా కన్పట్టుచున్నది.

  • శ్రీ ,ముట్నూరి సంగమేశ్వరంగారి "చోడిగాడి కలాపం" వ్యాసంనుండి నాట్యకళ. పిబ్రవరి - మార్చి 1970 పు.50
    • డా. పి.ఎస్. ఆర్ అప్పారావుగారు తెలుగునాటక వికాసము - పుట.155