పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/326

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యంగ్యం, సామాజిక రుగ్మతలమీద విసుర్లు, విమర్శలు ప్రజల్ని ఆలోచింపచేసేవి. భీమరాజు జాతీయ అంతర్జాతీయ రాజకీయాల పరామర్శ, కనకంహాస్యం జనంలో కొత్త చైతన్యాన్నిసృష్టించేవి. కొటేశ్వరరావుగారు తనకుటుంబాన్నంతటినీ కొడుకులూ, కూతుళ్ళనుకూడా యీ కళలో ప్రవేశపెట్టిన కళాతపస్వి. విశాఖజిల్లా ఆనందపురంలో ఘంటాకంకణం, విశాఖలో మణికంఠహారం వేసి కోటేశ్వరరావుగారిని సన్మానించారు.

44. భారతి బుర్రకధ దళం:-

      సామర్లకోట.  కధకురాలు శ్రీమతి చినగంధం సత్యవతి.  ఈమెపేరు భారతిగా మార్చుకుండి.  వ్యాఖ్యానం శ్రీ తాడి మురళీమోహనరెడ్డి.  హార్మోనీ తబలాలు నట్టువాంగం, ఆమెపాట.  మురళీమోహనరెడ్డిమాట వీరికధకు బలం.

ఈ బుర్రకధలలో కళానైపుణ్యాన్ని ప్రోత్సహించు ఉద్దేశంతో తూర్పు గోదావరిజిల్లా ప్రజానాట్య మండలివారు రాజమండ్రి శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో 1980 డిశంబరు 28, 27 తేదీలలో బుర్రకధ కళాపరిషత్ నిర్వహించింది. న్యాయనిర్ణేతలుగా యీగ్రంధరచయిత, సేనియర్ నాజర్, మండ సుబ్బిరెడ్డి వ్యవహిరించారు. ఇవిచూశాక మళ్ళీ యీ రంగం విజృంబిస్తుందనే విశ్వాసం కలిగింది. నాజర్ గారికి పర్మశ్రీ యివ్వడం బుర్రకధకళనుకూడా ఒక గొప్ప కళగా భారతప్రభుత్వం గుర్తించిందనడానికి నిదర్శనం.

                               య క్ష గా నా లు
   యక్షగానాలమీద సమగ్రపరిశోధననజరిపిన  డా|| యస్. వి. జోగారావుగారు యక్షగానాన్ని గురించి ఈక్రిందిరీతి తెలిపాతు.

1. 'అది సర్వోభోగ్యమైన సమాహార కళ '
2. 'వివిధప్రక్రియలనుబంధము (ప్రబంధము, కలాపము, ఉలప్రబంధము, కొరవంజి, వీర్హినాటకము, మార్గనాటకము, బొమ్మలాట, జంగంకధ, హరికధ, ఆధునికనాటకము మొదలగు వివిధ ప్రయోజనాత్మకమైబయల్వెడలిన సాహిత్యప్రక్రియలతో దీనికి సంబంధం కలదు).
3.బహువిధ పదకవితా ప్రభేద సమీకరణము
4.వస్తు వైవిధ్య సంపన్నము