పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/311

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణంలో చొప్పించబడివుండవచ్చునని శ్రీ నేలటూరి వెంకటరమణయ్యగరు వ్రాశరు. "రాజకవులు" విమర్శగ్రంధంలో. మరి బాలనాగమ్మ పద్యకావ్యంల్గానీ, గద్యకావ్య్హంగానీ లేదు. కాబట్తి నెడు లభ్యమౌతున్న "బాలనాగమ్మ" తంబురపాట క్రీ.శ. 12వ శతాబ్దికి ముందే వుందని చెప్పవచ్చు.

   ఒకనాడిది ఒకజాతివారికి భిక్షుకవృత్తికి ఆలంబనగా వుండేది. ఇద్దరు స్త్రీలుగాని ఇద్దరు పురుషులుగానీ, ఒకస్త్రీ. ఒకపురుషుడుగాని ఒక్రు తంబురావాయిస్తూ అందెమ్రోగిస్తూ కధ ఫాడుతుంటే రెండవవారు ఢక్కీ వాయిస్తూ 'తందాన తాన ' అని వంతపాడుతుండేవారు.  ఆలా గుమ్మం గుమ్మానికి కొంతకొంతపాడుతూ బియ్యం, పాతబట్టలూ అడుక్కునేవారు.  ప్రజలు ఎంతోఆప్యాయంగావింటూవారికి భిక్షవేసేవారు.  ఒకోసారి ఆయా వీధిఆడవాళ్ళంతాచేరి వీరినికూర్చుండంబెట్టుకుని యీకధలు పూర్తిగా చెప్పించుకుని వానిలోని వీర, కరుణ రసాలకు నీరైపొతూ శేరుబియ్యం చేటలతోతెచ్చి వారికి పెడుతుండడం తెలుగునాట పల్లెటూళ్లలో యిప్పటికీ మనకు కనిపిస్తూనేఉంటుంది.
  దీన్ని భిక్షుకవృత్తిస్థాయినుంచి పెంచి నాట్యాదివిషయాలు జోడించి గజ్జెకట్టించి, బల్లకెక్కించి, పూలదండలు వేయించి పండితాదరణ తెచ్చిన గౌరవం శ్రీ నాజర్ కేదక్కుతుంది.  ఆంధ్రదెశంలో ప్రజానాట్యమండలి యీ ప్రక్రియను ఒకఊపుయివ్వడంతో వాడవాడలా బుర్రకధదళాలు వెలిశాయి.  వీరబొబ్బిలి, పల్నాటియుద్ధం, సీతారామరాజు, నేతాజీ, బాపూజీ3, నెహ్రూజీ, బెంగాల్ కరువు యిలా ఎన్నోకధలు. నిజానికి స్వాతంత్ర్యపొరాట అంతిమఘట్టంలో ప్రజల్నిప్రేరేపించడానికికళారంగంలో యీ ప్రక్రియ బాగా ఉపయోగపడింది.  క్రమంగా ఆనాటినుంచీ రాజకీయ ఎన్నిక;ల రంగంలో కూడా అన్నిటికన్నా దీనిపాత్రే ఎక్కువ.
   సమకాలీన ప్రజాసమస్యల్ని కధగా మలుచుకుని అనుపమానంగా తెలుగుదేశాన్ని ఏలిన తొలిబుర్రకథ 'కష్టజీవి '.

"రామాపురమని ఉత్తరాదిలో రాజీలు నొక పల్లె
  ఆవూరినిగల వన్ని గుడెశలే అడవికంప దడులే"