పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/305

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

41. అమృతకవి శ్రీశైలంభాగవతార్ గారు:-

           వెదురుపాక (తూ.గో) వీరు వయలిన్ విద్వాంసులు కధ సంగీతప్ర్రాముఖ్యతతొ నడుస్తుంది.  భారత రామాయణక్ధలు, విదికధలు పలుచోట్లచెప్పి మంచి కధకులుగా కీర్తిగడించారు.  మైక్ లేకున్నా వినిపింఛెటంతటి గభీరతాత్రం.

42. గాజుల దాసుగారు:-

 వీరిస్ఫగ్రామం అరికిరేవుల (తూ.గో) వీరి ఆసలుపేరు నాగేశ్వరరావుగారు.  వీరు పూర్వం గాజులవాపారం చేసేవారు.  అందుకని వీరిని గాజులదాసుగారని పిలిచేవారు.  దేశంలోపలుగ్రామాల్లో కధలు చెప్పేరు.  తిరుపతిదేవస్థానంలోకూడా అడపాదడపా కధలుచెబుతుంటారు.  భారత రామాయణభాగాలు విదికధలుగా చెబుతారు.

43. దువ్వూరి సుబ్బారావుగారు:-

    కాకినాడా. కధకులు. మంచి హార్మోనిష్టు.  ప్రమీలార్జునీయం, హనుమత్సందేశం, సతీసుమతి, మారుతిచిటికలు, తులసీజలంధర కధలుచెప్పేవారు.  వీరికధలలో "మారుతిచిటికెలు"కధ పేరెన్నికగన్నది.

44.శ్రీ తణుకు విశ్వనాధ భాగవతార్ :-

     కాకినాడ.  రామాయణం, బ్రహ్మంగారిచరిత్ర వారాలతరబడిచెబుతారు.  సంగీతవిద్వాంసులు.  జానాకర్షకంగా కధలు చెబుతారు.

45. తణుకు ప్రభాకరంగారు:-

   సామర్లకోట.  బ్రహ్మంగారి కధచెబుతారు.  కధ సంగీతపరంగానూ సాహిత్యపరంగానూ ఉం'టుంది.

46. శ్రి కొచ్చెర్ల రామకృష్ఠ భాగవతార్ :-

    భీమవరం. నలదమయంతికధక్ వీరు పెట్టిందిపేరు.  సంగీతసాహిత్యాలు సమానంగా పోషిస్తారు.

47. అర్జునదాసుగారు:-

 ముమ్మిడివరం (తూ.గో.). దీక్షితదాసుగారి శిష్యులు.  అన్ని కధలూ చెబుతారు.  చాలామందిశిష్యుల్నితయారుచేశారు.