పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/304

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36. కూళ్ళ వెంకటరెడ్డిగారు:-

   వీరిస్వగ్రామం కూళ్ళ (ప.గో)  భరతకధలు, విడికధలు చెప్పేవారు.  కధ చెప్పడంలో, నృత్యాభినయంలో, చమత్కార సంబాషణలో గల ప్రత్యేకతలు స్రీ సమాజాన్ని బాగా అకర్షించేవి.  చదివింపులు కధను సాగనిచ్చేవికావు.  అది వారికధ ఆకర్షణ.

37. వడియ్యదాసుగారు:-

    కొలకుదురు. (తూ.గో)  వీరు సహజంగా హాస్యనటులు. అనేక పౌరాణిక నాటకాలలొ హాస్యనటుడుగా గుర్తింపుపొందారు.  చింతామణి నాటకంలో శ్రీహరివేషం కొట్టినపింది.  రెండు మూడు కధలునేర్చుకుని అప్పుడప్పుడు ఊళ్ళో ఉత్సవాలకి అందరూప్రోత్సహిస్తే కధచెప్పేవారు ఎంతకధైనా వడిగా అరగంటలో చెప్పేవారు.  అందుకని జనంముద్దుగా వడియ్యదాసూని పేరుపెట్టారు.  అసలుపేరు నల్లమిల్లి వీర్రెడ్డి  ఈతని కధకి హాస్యమూ వంకరనడకలు ప్రాణం.

38. శ్రీ ఆదిరెడ్డి భాగవతారు:-

  కురుకులూరు (తూ.గో.) వీరుకూడా బసివిరెడ్దిగారి శిష్యులే.  గౌలగాత్రం, పాడుతుంటే గొంతు ఖంగుమని మ్రోగేది.  ఆమాధుర్యం జణ విడవకుండా వచ్చేటట్టు చేసేది.  బొబ్బిలియుద్ధం నాటకంలో పాపారాయుడు వేషంలో హాలుదద్దరిల్లిపోయేది.

39. శ్రీ గూనపల్లి సూర్యనారాయణ భాగవతార్ :-

     రామచంద్రపురం.  వీరు మంచి సంగీతవిద్వాంసులు.  కధలో శాస్త్రీయసంగీతాన్ని గుప్పించి రకర్కాల రాగాలాపనలతో మెప్పించి కధను నదిపించడంలొ ప్రసిద్ధులు.

30. ప్రయాగ నరసింహశాస్త్రిగారు:-

   వీరిస్వగ్రామం పోలమూరు. (తూ.గో.) వీరు ఆకాశవాణి ఉద్యోగిగా పనిచేస్తూ ఆకాశవాణి విజయవాడకేంద్రంనుంది ఎన్నో కధలు గానంచేశారు.  ఇతర జానపదకళలోకూడామేటి.  ఆయనగొంతుకో ప్రత్యేకతఉంది.  సమయస్పూర్తికి పెట్టిందిపేరు.