పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/303

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెప్పేవారు. ఘంటాకంతలు, కేయూరసన్మానాలు, బిరుదులుపొందారు. వీరి సంపాదన దానధర్మాలక్రిందే ఖర్చు.

30. శ్రీ ఉయ్యూరు బులిరాజు భాగవతార్:-

   వీరిది అంగర. (తూ.గో)  వీరుకూడా రచయిత, కధకుడు, భారతం సీరియల్ గా చెబుతారు.  కధ సంగీతసాహిత్యపరంగా, భక్తిగా ఉంటుంది.  ఇతర ప్రసంగాలూ, హాస్యోక్తులూలేకుండా కధను పోషిస్తూ చెబుతారు.

31. ఘట్టి శేషాద్రిశాస్త్రిగారు:-

   తాదేపల్లీగూడెం.  దీక్షితదాసుగారి శిష్యులు.  చక్కని అనుభూతితో రక్తిగా కధచెబురారు.  "దైవజ్ఞశిఖామణి"గా కూడా పేరుంది.

32. కొమ్ముసుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు:-

    ఆకివీడు (తూ.గో) ఎం.ఏ. పట్టభద్రులు. అని కధలూ సాహిత్యపరంగా చెబుతారు.

33. నల్లమిల్లి నర్రేడ్డిగారు:-

    రాయవరం. (తూ.గో) వీరు నల్లమిల్లిబసివిరెడ్ది భాగవతారు గారి సోదరులు, శిష్యులు.  అన్నగారిఛాయలొ అక్కడక్కడ విడికధలు చెప్పేవారు.  కధ సూటిగాచెప్పడం వీరిప్రత్యేకత.

34. పులగం సత్యనారాయణరెడ్దిగారు:-

   కుతుకులూరు (తూ.గో.) వీరు నల్లమిల్లి బసివిరెడ్దిగారి వద్ద వయొలిన్ వాయిస్తూ వారిదగ్గర కధలు నేర్చుకుని అనంతరం కధకులుగా భారత గాధలు చెప్పేవారు.  వీరి కధలోని మధురమైన సంగీతం జనాన్ని విశేషంగా ఆకర్షించేది.

35 డా: నల్లమిల్లి బాపిరెడ్దిగారు. ఎం.ఏ.ఫిహెచ్ డి.

     రాయవరం (తూ.గో.) వీరు బసివిరెడ్దిగారికుమారుడు, శిష్యుడు కూడా.  బాల్యం లో నే తండ్రిననుసరించి కధలకు వెళుతూ వారిదగ్గర కధలునేర్చుకుని చిన్నప్పుడే మంచికధకులుగా పేరుతెచ్చుకున్నారు.  ఎదిగాక ఎం.ఏ. పాసై రమచంద్రపురం వి.యస్. యం. కళాశాలలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.