పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/302

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24. సలాది భాస్కరరావుగారు:-

  కాకినాడ. వీరుచెప్పేకధ నర్తనశాల.  సమకాలిక రాజకీయాల మిళాయింపు వీరికధలో క్రొత్తదనం.  అందులో హేతుబద్ధంగాచేసే విమర్శలు, కట్టమంచి రామలింగారెడ్డిగరివంటి సాహితీవేత్తల గ్రంధాల పరామర్శలు, జనబాహుళ్యాన్ని ఉర్రూతలూగించే మసాలా దినుసులు.

25. వేదనభట్ల వెంకటరమణయ్యగారు:-

    పిఠాపురం.  వీరు దారాయణదాసుగారి శిష్యులు ఎన్నో చోట్ల రామాయణకధలుచెప్పి కీర్తిపొందారు.  కరుణరసపోషణలో కధ రక్తిగా నడిపించే శక్తి వీరిది.  విశాఖరేడియోస్టేషనులో నిలయ విద్వాంసులు.

26. అన్నంనీడి భాలకృష్ణదాసుగారు:-

  రామచంద్రపురం.  (తూ.గో) వీరుకూడా నరాయణదాసుగారి శిష్యులే.  సాతిత్రైకహ్దకు వీరు పెట్టింది పేరు.  సర్వజనరంజకంగా కధలు చెప్పి ఎన్నో సన్మానాలు, బిరుదులు పొందారు.

27. ఎం.టి. రావుగారు:-

  రానమండ్రి.  మొదట గున్నేశ్వరరావుగారి కంపెనీలో నటుడుగాను హార్మోనిష్టుగానూ తిరిగేవారు.  తరువాత నారాయణదాసుగారి శిష్యరికంలో కధలునేర్చుకుని హరికధకునిగా వాసికెక్కారు.

28. పెడసనగంటి సోమయ్యగారు:-

   రావులపాలెం. (తూ.గో) కధకులు, రచయిత కూడా. పూర్వపు బాణీలో రామాయణం, ఇతర విడికధలు చెప్పేవారు.  విడికధలుచెప్పేటప్పుడు తెల్లవారిందాకా కధాగానం చేస్తూనే ఉండేవారు.  వీరికి తెలిసినన్ని పూర్వగాధలు మరెవరికైనా తెలుసునంటే అనుమానమే.  గొప్ప పండితులు కధ రక్తిగా, సాహిత్యపరంగా ఉండేది.

29. చింతా శివరామశాస్త్రిగారు:-

    మురారి. (తూ.గో) వీరు వాజపయాజుల సుబ్బయ్యగారి శిష్యులు.  రామాయణం సీరియల్ గా ఎన్నోచోట్ల చెప్పేవారు.  ఎన్నో విదికధలు కూడా చెప్పేవారు.  శృంగార, హాస్యరసాలు పొషిస్తూ ఆకర్షనీయంగా