పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

17. చిట్టాల ఆంజనేయులుగారు:-

   వీరిది రావిపాడు (తూ.గో) పెంటపాటి సుబ్బయ్యగరి శిష్యులు.  వీరి భక్తమార్కండేయకధకు మంచిపేరు.  రామాయణం వగైరా ఎన్నో కధలు చెప్పేవారు.  మైకులులేని ఆరోజుల్లో వీరికధ రెండుమొడువేల మందికి వినిపించేది.  అంతపెద్దగాత్రం.  వీరరసపోషణ కధలే అధిక ప్రాధాన్యతపొందేది.

18. శ్రీ తెలికిచర్ల కృష్ణమూర్తి భాగవతార్:-

    రాజమండ్రి. దీక్షితదాసుగారి శిష్యులు.  వీరి "రామభక్తి" కధ ప్రసిద్ది.  భక్తితో రక్తిగాచెప్పి అందర్నీ పారవశ్యంచేస్తారు.  ఇతర కధలుకూడా ఎన్నో చెబుతారు.

19. పెదపాటి కృష్ణమూర్తిగారు:-

   తాడేపల్లిగూడెం. పెంటపాటి సుబ్బయ్యగరిశిష్యులు.  రచయిత, కధకులు, హరికధాపరిషత్ కు కార్యదర్శి.  రామాయణం, భారతం, భాగవతాలను చెబుతారు. చాలామందిశిష్యుల్ని తయారుచేశారు.

20. మల్లది శ్రీరామమూర్తిగారు: -

 ఏలూరు.  డ్రాయింగుటీచరు - కధకులు, సంగీతసాహిత్యాల మేలుకలయిక వీరికధలో కనిపిస్తుంది.  కధలో భక్తికి ప్రాధాన్య ఎక్కువ.  

21. ముదపాక బాలసుందరంగారు:-

  భీమవరం, యువకధకులు, ముదపాక మల్లేశ్వరరావుగారి తనయుడు, శిష్యుడుకూడా.  కధ చురుకుగా రక్తిగా నదిపిస్తారు.

22. గొర్తి కొండయ్యశాస్త్రిగారు:-

  వీరిది ఇందుపల్లి (తూ.గో) గొప్ప సాహితీవేత్త. తరుదు రామాయణం సీరియల్ గా చెప్పెవారు.  కధలో సాహిత్యవాసనల గుభాళింపు ఎక్కువ.

22. అక్కిపెద్ది శ్రీరామశర్మగారు:-

   కపిలెశ్వరపురం (తూ.గో) సర్వారాయహరికధా గురుకులంలో ఎంతోమందిశిష్యుల్ని తయారుచేశారు. వెరికధలో ప్రాముఖ్యం కధకే.