పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12. శ్రీ కత్తుల కృష్ణారావు భాగవతార్:-

     వీరు రాజమండ్రి వాస్తవులు,ఎన్నోనటకాలలో పాత్రలుధరించి పేరుగడించారు.  అందులో బక్తరామదాసువేషం తాదాత్మ్యంపొంది నటించేవారు.  నారాయణదాస్కరిశిష్యులై కధలు నేర్చుకుని రామాయణం, భారతం, భాగవతం, శివలీలలు, బ్రహ్మంగారిచరిత్ర సీరియల్సుగా చెప్పడమేగాక వానిని విడికధలుగాకూడా చెప్పేవరు. హెందీ, ఇంగ్లీషు సంసృతం, ఒరియా ఇంకా అనేక బాషలలొ పరిచయంఉంది.  ఆ భాషలలోని రమ్యమైన విషయాలుయీ కధలోకి ఎక్కించి ఉపయోగించేవారు.  ఇతరేరాష్ట్రాల్లోకూడ ఎన్నో కధలు సీరిఅల్సుగా ద్చెప్పేరు.

14. భమిడి పాడి సూర్యనారాయణగారు:-

వీరి స్వస్థలం పలివెల (తూ.గో) వీరు కవికూడా. రామాయణం మంచిపట్టుగా చెప్పేవారు. ఎక్కడా రామాయణంచెప్పినా పదిమెడల్సులకు తక్కువకాకుండావచ్చేవి. అవన్నీ సుమారు వందమెడల్సుపైనే దందలుగా గ్రుచ్చి మెడలో వేసుకొనేవారు. వీరిని కాసులదాసుగారని పిలిచేవారు. వీరు ఎంతసేపు కధచెప్పినా జనం విసుగులేకుండా వినేవారు. కధ భక్తిగా, సాహిత్యపరంగా సాగేది.

15.ఖందవల్లి భానుమూర్తిగారు:-

   వీరిది తాడేపల్లిగూడెం, సహజంగా సంగీతవిద్వాంసులు.  వీరిది దేవగానమని ప్రసిద్ధి.  ఎన్నో అపురూపరాగాలుపాడేవారు.  దీక్షితదాసుగారి శిష్యులు.  వీరి సాత్రి, కీచకవధ జనాల్ని బాగా ఆకట్టుకొనేవి.  .  ఎక్కడికివెళ్ళీనా కీచకవధ చెప్పమనెవారు.  హాస్యరసపోషణకు యీయన పెట్టిందిపేరు.  కథ సంగీతపరంగాఉండేది.  వీరు 'సంపూర్ణరామాయణం' సినిమాలోకూడా నటించారు.

16. భమిడిపాటి వెంకటనారాయణగారు:-

   వీరిఊరిపేరు ఉందిఅగ్రహారం (ప.గో) దీక్షితదాసుగారి శిష్యులు.  ఏ కధచెప్పినా కధాపొణకే ప్రాధాన్య్హం.  కీర్తన సమతూకంగా పాడాలంటే వెంకటనారాయనదాసుగరే పాడాలనేవారు.  రసోద్దీపనతో కధ చెప్పడం వీరి ప్రత్యేకత.