పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కీరనలు, వ్యాకరణోగ్దిష్టమైన వచనం, అదుగడుగునా అలంకారాలు అనిప్రాసలు, అంత్యప్రాసలు, యమకాలు, గమకాలు, ప్రలిచొటా పరిమళించే కవిత్వం. ఈ సాహిత్యం తెలుగు సాహితీచరిత్రలో ఎందుకు చొటుచేసుకోలేదో ఆశ్చర్యం:

    "రూపవాన్ మధురభాషీ". కధకునికి చక్కని స్పురదూప్రం, వాక్చాతుర్య, సంగీత పరిజ్ఞానం, శ్రావ్యమైన గొందు, లౌకిజ్ఞానం చాలా అవసరం.  కధల్లో మధ్యమధ్య త్యాగరాజ కీర్త్రనలు, రామదారు కీర్తనలు, మీరా కీర్తనలు, అధ్యాత్మిమ తత్వాలు కర్ణపేయంగా పాడి పురానాంతర్గత ధర్మాలు, హితోక్తులు చెప్పి జనహృదయాలని రంజింపజేసేవారు కధకులు.
  హరికధకులు తాము నటులుగామారి, పాత్రోచితంగా పలుకుతూఅ మంచి రసోత్పత్తితోచెబుతూ ప్రేక్షకుల్ని అందులో లీనంఛెస్తూఉంటేనే కధ రాణిస్తుంది.  ఇలా లీనంచేసుకొవడమనేది కోట సచ్చిదానందశాస్త్రి 'కర్ణ ', రావుకమలకుమారి 'ప్రమీలార్జునీయం ', భల్ల బసవలింగంగారి "గంగావతారణం" కధలలోని ప్రత్యేకత.
    యుద్ధరంగంలొ కర్ణుడిరధసారధి సహాయనిరాకరణచేస్తాడు.  రధచక్రాలు భూమిలోకి కూరుకుపోతుంటే ఆస్థపడుతూ భుజంపట్టి వానిని పైకిలెపుకుంటున్నాడు కర్ణుడు.  అందరికీ అయ్యోపాపం అనిపిస్తోంది.  అయినా అర్జునుడు అతనిపై బాణవర్షం కురిపిస్తూనె ఉన్నాడు.  కాని అవికర్ణుడికి గుండెకుతగిలి పూలహారాలుగా మారిపోతున్నాయట.  కారణం, ధర్మదేవత అతనిగుండెలమీద తిష్టవేయడమే.  ఇది గ్రహించిన కృష్ణుడు ముసలిబ్రాహ్మణవేషంలో వెళ్ళి దానం అడిగాడట.  "ఈ యుద్ధరంగంలో ఈ నిస్సహాయ స్థితిలో నీకు నేను ఏమి ఇవ్వగలను బ్రాహ్మణోత్తమా ! సర్వశక్తులూ ఉడిగిపోతున్న సమయంలో నాదగ్గరఏముందని ఇవ్వగలన్?" అన్నాడట కర్ణుడు.  దానికి కృష్ణుడు "నువ్వుచేసిన దానఫలం ధారపొయ్యి చాలూ అన్నాడట.  వెంటనే అమ్ములపొదిలోని బాణంతీసి అరచేత గుచ్చుకొని ఆ రక్తతర్పణంతో తన దానఫలాన్ని ధారపోశాడట కర్ణుడు.  అప్పుడు కృష్ణుడువెళ్ళి 'ఈసారి బాణం వెయ్య్హి అర్జునా" అనగానే ఆ