పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలిసిన మేధావిక్రింద లెక్క. కనుకనే అతనుచెప్పే ప్రతిమాటా ఎంతో ఆసక్తిగా వినేవారూర్ధరాత్రివరకూ, వర్షాకాలం వచ్చిందంటే వార్షికంగా ఊరూరా హరిదాసులు రామాయణ, భారత, భాగవత కధాకాలక్షేపం ఒకమండలంపాటు (40 రోజులు) వరుసగాచెప్పేవారు ఆరోజుల్లో.

   వీరికి ఆదిపురుషుడు ఆదిభట్ల నారాయణదాసుగారు.  అందుకే వీరిని "హరికధా పితామహ" అన్నారు.  వీరికి ముందు యీకధలు లేవని కాదు.  మద్రాసునుంది విజయనగరంవచ్చి కుప్పుస్వామినాయుడు గారు ధృవచరిత్ర హరికధచెప్పగా దానివల్ల ప్రేరేపితుడై తానీ రంగంలోకి దిగానని శ్రీ నారాయణదాసుగారే స్వయంగా చెప్పుకున్నారు తమ ఆత్మకధలో.  అయితే ఈ పితామహబిరుదు అల్లసానిపెద్దన్నగారి బిరుదు వంటిదే.  అల్లసాని పెద్దనగారిని "ఆంధ్ర కవిపితామహ" అన్నారంటే అంరకుముందు తెలుగుకవిత్వం లేదనా? పెద్దన్నగారి మనుచరిత్ర కావ్యంతో ఒక కొత్తపుంతనుతొక్కింది తెలుగుకవిత్వం.  అలాగే నారాయణదాసుగారి ప్రవేశంతో హరికధారంగం పండితపామరజనరంజమమై ప్రక్రియావైశిష్ట్యాన్ని పొందింది.
     "హరికధా పిరామహుడు ఆదిభట్లదాసు, సంగీతం సాహిత్యం సరితూచిన త్రాసు" అన్నారు మహాకవి శ్రీ శ్రీ. జంధ్యాలపాపయ్యశాస్త్రి గారు యిలాఅన్నారు--

"వాల్ మెలెమీసకట్టు జునపాలజుట్టు
  నొసటకుంకుమబొట్టు మేల్ ప్సిడికట్టు
  విద్దీలకూపట్టు, నడయాడు వేల్పుచెట్టు
  హరికధాశిల్పసమ్రాట్టు ఆదిభట్ల"

ఆయనేట్టిన ఒరవడి ఈనాటివరకూ కొనసాగుతున్నది. అందుకే ఆయన్ని తలవని హరిదాసు ఉండడు. ఆటా, మాటా, పాటల్లో ఆయన కాయనేసాటి. ఒకసరి దాసుగారిని సభలో హరికధకాదు గిరికధ చెప్పమన్నారట. వెంటనే అప్పటికప్పుడు 'గిరిజాకళ్యణం ' చెప్పి సబికుల్ని ఆశ్చర్యచకితుల్ని చేశారట.