పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేటి ఈ హరికధావికాసంమాత్రం 20 వ శతాబ్ది పూర్వార్థంలొనే జరిగింది. ఈ కళాసరసస్వతి ఆరోజుల్లో నడివీధిలో గజ్జెకట్టి ఆడింది. ఆకాలంలో వర్షాకాలంవస్తే ఏపల్లెలోచూసినా రాత్రి పదయ్యేస్రికి "ఓరోరీ గణపాతీ రారా - నీకుండ్రాళ్ళూపోసేదా రారా" అంటూనో, "తాండవనృత్యహరీ గనానన, ధిమికిట ధిమెకిట బాజా మృదంగ" అంటూనో గణపతి ప్రార్ధనతో ప్రారంబమై అర్ధరాత్రి రెండు గంటల వరకూ "వనమానా నుతుడు పట్టు పాదారా విందములకు" అని దాసుగారు మంగళం పాడేవరకూ అందరూ పరవశులై వింటూ కూర్చోవలసిందె. అక్షరాస్యత నామమాత్రంగా ఉన్న ఆరొజుల్లో పల్లెజనుల్లో విజ్ఞాన, వినోద, వికాసాలు కలిగించిన ఉపాద్యాయులు హరిదాసులే.

  ** "ఈ విద్య లోకమందున నావిర్భవమంది షష్టి మాయనములగున్ నెవచియించెడు నేటికి" అని కొమ్మూరి బాలబ్రహ్మానందదాసుగారు వ్రాశారు.  ఈ గ్రంధప్రచురణకాలం 1929 అయినందున ఆనాటికి షష్టి మాయనాలంటే 60 సంవత్సరాలు - క్రీ.శ. 1880 అవుతుంది.  నారాయణదాసుగారు గజ్జెకట్టింది 1883లోనేకనుక నేటి హరికధ ఆవిర్భావం క్రీ.శ.1880 ప్రాంతం అనిచెప్పవచ్చు.
    హరికధానగానే నిఘంటువులో 'హరి ' శబ్దానికిగల నానార్ధాలుచూసే యిది విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు, కప్ప, కోతి, పాము వగైరావాని తాలూకు కధ అని భావిస్తే పొరబాటు.  పోనీ 'హరి ' అనే నామాన్ని బట్టి విష్ణూరమైన ఆలోచనకూడా నేటికధకు సరిపడదు.  హరికధ ఒక కళాప్తక్రియ, కాళ్ళకుగజ్జెలు, చేతిలోచిడతలు, ముంజేతికి సింహతలాటం మురుగులు, భుజాలకు దండకడియాలు, నుదుట కుంకుమబొట్టు గిరిజాల తల, మధ్యపాపిడి, వెనక సిగముడి, మెడలో పూలదండలు, పట్టుపంచి, జరీకండువా ఇదీఆనాటిహరిదాసువేషం.  ఇరువైపులా మద్దెలా ఫిడేళ్ళూ వెనుకవైపు హార్మోనీకృతి దాసుగారి ఉపాంగాలు.  కొందరు కంజెరాకూడా పెడితే మరికొందరు అగ్గిపెట్టెలవాయిద్యంకూడా ఏర్పాటుచేసేవారు.  ఆరోజుల్లో హరిదాసు విజ్ఞాన ఖని. సంగీత సాహిత్య విషయాలే కాకుండా శాస్త్ర్, పురాణ, రాజకీయ, చారిత్రక విషయాలుకూడా ఆమూలగ్రంగా

    • హరికధా విధానము పు.11 (హరికధా సర్ఫస్వం).