పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భరా పెనుగొండ పట్టనప్రకాశకా! ధర్మనిష్టాగరిష్టా ' అనీ, కంసాలినిసోవొహో విశ్వబ్ర్రహ్మనా! కనక కుండలాబరణా ! కాళీవవర ప్రసాదకారమనా!" అనీ, కాపులను "కామధేనూ! కాపులుగల గంగవేగదా కాపురములు చేయగన్గె. కాసేకదకన్న తండ్రి ' అనీ ఎడరెగటిధారతో ఎదుటివారిని ఉక్కిరిబిక్కిరె చేసేస్తారు. దానధర్మ విశేషాలనుగురించి వివరిస్తూ 'ప్రభూ! జగత్తులో వస్తేపోనివి రెండు, పోతేరానివి రెండు, వస్తే పోనివి పాపం, అపకీర్తి. పోతే రానివి ధర్మం, కీర్తీ అనిచెప్పే పాందిత్యపు లొతులకు ఆశ్చర్య పడనివారుండరు.

                       గొ ల్ల భా యు డు వే షం
   చేతికి సీవండిమురుగులు, ముక్కునకాడ, పంగనామం, పిలక, పిర్రలదాకాఎగ్గట్టినపంచె ధరించి మెకల్నితొలే పొడవాటికర్ర చేత్తో పట్టుకొని "హరిహరీ నారాయో ఆదినారాయో, కరునీంచి మమ్మేలూ కమలలోచనుడా" అని పాడుకుంటూ గంతులెస్తూవస్తాడు.  ఈ వేషంతోపాటు వైష్ణవ గురువువేషంకూడా వస్తుంది.  గురువు 'దండంపెట్టరా గొల్లా" అంటే గొల్లభాయుడు కర్ర పైకెత్తుతాడు నెత్తిమీదఒకటికొట్టడానికి.  అదేంట్రా నాయనా" అంటే "దండం అంటే కర్ర అని చిన్న పురాణమ్లోయిన్నా" అంటాడు.
    "అదికాదురా దండం అంటే నమస్కరం" అంటారు గురువు.  దానిని 'ఎర్రిగొల్లోణ్ణిఎట్టాగెట్టాలో నాకేంతెలుసు? నువ్వు నాకెట్టిసూపించు తరువాత నేనీకెడతా" అంటాడు.  వీరిద్దరి మధ్యా చిత్రమైన పొదుపు కధలూ చమత్కారాలూ ఎన్నో !
    'చూసిచచ్చినోదొకడు, చూడకచచ్చినోడొకడు - ఇచ్చిచచ్చినోడొకడు, యివ్వకచచ్చినోడొకడు - యీళ్లెవరో చెపుకోచూద్దాం ' అంటాడుగొల్లడు.  దానికి గురువుతెల్లమగం వేస్తే అతడిలా విప్పుతాడు- 
   "చూసిచచ్చినోడు జటాయువు, చూడకచచ్చినోడు దశరధుడు, ఇచ్చిచచ్చినోడు బలిచక్రవర్తి.  ఇవ్వకచచ్చినోడు రావణాబ్రహ్మ.  తెలిసిందా ?" అంటాడు గురువుమీదతనఆధిక్యతవెలుబుచ్చుతూ. అలాగే "కరకర జరజర దిబుక్కుమే" అని మరోకధపొడిచి గురువుచెప్పుకోలెకపొతే$ చంకలు