పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగ్రహారంలొ అయ్యవార్లంగారలనేవారి ఆదరణతో ఒకపీఠాన్ని స్థాపించి యీ పీఠంలో పగటివేషాలు చెప్పేవారు. వేషాల భాషనుకూడా తానేకూర్చి శిష్యగణాన్ని తయారుచేశారు. స్థానిక బ్రాహణ కులానికి చెందిన పాపట్లవారు, వేదాంతంవారు వగైరాలకుటుంబాలపిల్లలు యీ శిక్షణపొంది పగటివేషాలతో ఆంధ్రదేశమంతా పర్యటిస్తూ, జనాన్ని బాగా ఆకట్టుకునేవారు. అపట్లో కూచిపూడివారి యక్షగానాలలో హాస్యం పాలు శూన్యం. విరామ సమయాల్లో యీ వేషాలు ప్రవేశపెట్టి ప్రేక్షకులకు హాస్యాన్ని అందింఛేవారు. ఈ హనుమంతపురం అగ్రహారమే యిప్పుడు "గడ్డిపాడు" గా పిలఫ్వబడుతోంది.

    పగటి వేషాలు రెండురకాలు 1) తామస వేషాలు 2) సాత్విక వేషాలు గడ్డిపాడువారివి సత్వికానికి చెందినవి.  హనుమాన్ జంక్షను వద్దనున్న కొమ్మూరువారికి, నూజివీడు దగ్గరున్న గొల్లపల్లివారికి యీ కళ వల్లావఝ్ఝులవారి శిక్షణవల్ల అబ్బిందే.  వీరు యాదవులు.  వీరిలో పాలిబోయిన  పెదముసలయ్యగారు, ఏయర్ల లక్ష్మీనారాయణ గారు ప్రసిద్ధులు.  వీరి పిట్టల దొర, పాములాళ్ళు, మందులవాళ్ళ వేషాలు చూస్తుంటే వేషదారుల్లా ఉండేవారుకాదు. అచ్చంగా కట్టు, బొట్టు అవే.  ఈ వేషాలకు వీరు సువర్ణపతకాలుకూడా పొందారు.
   ఇక ఏలూరుదగ్గర సీతంపేటలోనున్న పగటివేషధారులుకూడా మంచి ప్రసిద్ధి గన్నవారే.  వీరు దక్షిణాదినుంచివచ్చిన ఈతముక్కజంగాలవారు.  వీరు ఎక్కువగా తామస వేషాలకు ప్రసిద్ధి.  శూర్ఫణఖ, బెతాళ వేషాలు, శక్తివేషంవంటివానికి వీరికి వీరే సాటి.  అలాగని సాత్విక వేషాలలో తక్కువేంకాదు.  సాధువుల వేషాలలో వీరిని నిజంగా సాధువులని భ్రమించేవారు.  వీరికి శక్తిపూజ ఉందనీ అందుకే మాంత్రికవేషాల్లో టక్కుటమార విద్యలు అద్భుతంగా ప్రదర్శించేవారని ప్రతీతి.
   ఇక్కడ రెందులూరులోని సున్నంవీరయ్యగారిదళంకూడా తామస వేషాలకు పేరెన్నికగన్న దళం.  వీరు విశ్వ బ్రాహ్మణులు. సున్నంవీరయ్యగరి బేతాళ వేషం చూస్తే గర్భిణీస్త్రీలు హడలి పిండం పడిపోయేదట.  ఏలూరు మోతేవారు వీరికి అఖండ సన్మానంచేసి గండపెండేరం తొడిగారు.  ఒకసారి బందరులో డాక్టర్ అహోంబలరావుగారింటికి కత్తి