పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/268

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆతరువాత కళింగగంగు అటుపోతున్న భాగవతులమేళంలో మూటలుమోసే నౌకరీ చేరాడు. భీమకవిచెప్పిన శాపవిముక్తి సమయానికి ఆ మేళం కళింగరాజ్యం చేరి ఏలికను ఆరాత్రి తమప్రదర్శన తిలకించమనికోరగా, రేపుపగలు తనకువోడి పరారి అయిన రాజ కళింగగంగువేషముకట్టిన చూడగలనని తెలుప, ఆ భాగవతులు అది తమ కసాధ్యమని దిగులుపడుతుంటే మూటలుమోస్తున్నగంగు ప్రభువులు కళింగగంగుయొక్క దుస్తులు, కత్తి, గుర్రము యిచ్చిన తానా వేషము కట్టగలనని చెప్పెనట. రాజందుకు సమ్మతించి వానిని సమకూర్చెనట. మరునాడు పట్టపగలు భాగవతులతో కళింగగంగు రాజసభను ప్రవేశించి గంగువేషములో వీరప్రదర్శనచేస్తూ రాజునుసమీపించి ఒక్కవేటుమ అతని శిరమునరికి తిరిగి రాజ్యాభిషిక్తుడయ్యేడట.

    తెలుగుసాహిత్యంలో పగటివేషం తొలుతగాయిక్కడ యిలాకనిపిస్తోంది.  ఈ భీమకవి కాలాన్ని నిర్ణయించడంలోకూడా పరిశోధకులు చాలా తికమకపడ్డారు నన్నయకు ముందువాడని కొందరు, తరువాతివాడని కొందరు, తిక్కనకుకూడా తరువాతివాడని కొందరు. అయితే భీమకవి శాపఉపసంహారపద్యంలోని 'మీనమ్మసం ' సౌరమానాన్ని తెలుపుతుంది గనుక సౌరమానమంటే నెతివలె 12 లల్నీ చైత్రం, వైశాఖం, జ్యేష్ట, ఆషాడం అని చరిత్ర చూస్తే ఈ మాసం రాజరాజనరేంద్రునితర్వాత కొద్దికాలమే ఉంది గనుక ఏపరిస్థితుల్లోనూ ఈయన తిక్కనకు పూర్వుడే అని కొద్దికాలమే ఉంది గనుక ఏపరిస్థితుల్లోనూ ఈయన తిక్కనకు పూర్వుడే అని నిర్దారించవచ్చు.  శ్రీ శ్రీపాద గోపాలకృష్ఠమూర్తిగారు భీమకవి తిట్టిన కళింగగంగు అనంతవర్మ చోడగంగిదేవుడని, యితని కాలం 1076-1147 మధ్య అనీ కళీంగ సంచికలో వ్రాసారు.  శ్రీనేలటూరివెంకటరమణయ్యగారు 'అన్న దేవుని ' రాజమండ్రిశసనాల ఆధారంగ వేములవాడభీమకవికాలం క్రీ.శ.1121 ప్రాంతంగా నిర్ధారించారు.
   ఇంత ప్రాచీనతగలిగిన యీ జానపదకళ 20 వ శతాబ్ది తొలిదశలో కూడా దేదీప్యమానంగా వెలిగింది.  19వ ?శతాబ్దిలో పగటి వేషాలు మైసూరులో మంచి ప్రజ్యలంగా సాగేవి.  అక్కడినుంచి తెలుగు బ్రాహ్మణుడు శ్రీ వల్లా వఝ్ఝుల వెంకట రామయ్యగారు తన పరివారంతో ఆంధ్రప్రదేశంవచ్చి కృష్ణాజిల్లాలో వీరంకిలాకు దగ్గర గల హనుమంతపురం