పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/265

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రఖ్యాతప్రదర్శనలు -- ప్రత్యేకపరిశీలన

     ఈ జానపద కళలలో సంగీత సాహిత్య నృత్యకళాభినయాలతో కండపుష్టి కలిగి పండితుల్ని కూడా మెప్పిస్తూ ప్రఖ్యాతిగన్న ప్రదర్శనలు ప్రత్యేక పరిశీలనార్హములు.  వానిలో పగటి వేషాలు, హరికధలు, బుర్రకధలు, యక్షగానాలు, భోగంమేళాలు కోలసంబరాలు, వీధినాటకాలు ముఖ్యమైనవి.  వీధి నాటకాలలో హరిశ్చంద్ర, చింతామణి, గయోపాఖ్యానం నాటకప్రదర్శనలు బహుళ ప్రాచుర్యం పొందాయి.  అందువల్ల ఆయా ప్రదర్శనల్ని మరింతలోతుగా ప్రత్యేక పరిశీలంతో వివిధ కోణాలనుంచీ విశ్లేషించడం వీని మనుగడను నిర్దేశించడం యీ అధ్యాయం ధ్యేయ.
                         ప గ టి వే షా లు
   తెలుగువారికిగల అపూర్వ జానపదకళాసంఫదలో "పగటివేషాలు" కూడా పేర్కొనదగినవి.  వీని ఆవిర్భవకాలాన్ని నిర్ణయించడానికి సరియైన చరిత్రకాధారాలు లభ్యంకాకపోయినా తెలుగు సాహిత్య విమర్శకుల పరిశోధనలో యిది స్ఫుటంగా ఒకచోట కనబడుతోంది.  అని వేములవేడభీమకని కాలం. శాపానుగ్రహసమర్ధుడగు ఉద్దండ పండితుడైన వేములవాడభీమకవి కళింగరాజ్యానికివెళ్ళి లోపలనున్న రాజకళింగగంగుకు తనరాక కబురుపంపగా అతడీతనికి దర్శనమీయలేదట - దానికి కోపించిన భీమకవి ముప్పదిరెండుదినంబులావలన్ ఝామునకర్ధమందతని సంపద శత్రుల జేరుగాఫ్వుతన్" అని శపించి వెళ్ళీపోయాడట.  ఆవిధంగానే శత్రురాజులుదండెత్తివచ్చి కళింగగంగునోడించగా అతడు పారిపోయి బికారియై వీధులవేంటతిరుగుతూ ఒకరాత్రి ఒకచోట కాలుజారి పాతరగొతిలోపడి "అంతబ్రతుకూబ్రతికిన మహారాజుకు యిప్పుడో కాలిదివ్విటీ అయినా లేకపోయెనే" - అని అడిగితే 'బీమకవిచేసిన జోగినిధి" అని ఏడ్చాడట.  అప్పుడు జాలిపడి మరల బీమకవి "అజిలో రాయలగెల్పి సజ్జనగరంబున పట్టముకట్టుకోవడిన్ రాయకళింగ గంగ - మీనమానమున పున్నమెవోయిన షష్టినాటికిన్" అని శాపవిముక్తిని అనుగ్రహించాడట.