పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గున్న బొమ్మలు ఒక్కొక్కటీ జరుపుతూ చూపెడతారు. ఆచూపెట్టేటప్పుడు ఆబొమ్మలకు సంబందించిన సమాచారముచెపుతూ పెట్టెవెనుక తాళంలా కొడుతూ ఆ సమాచారాన్ని లయతో పాటలాగ యిలా సాగిస్తారు.

“కాశీ పట్నం చూడర బాబు
 ఢిల్లీ కోట చూడరా బాబు
 బొంబయ్ పట్నం చూడర బాబు
 గంగానదిని చూడరా బాబు“

అంటూ వీనులకుకూడా విందుకల్పిస్తారు. పిల్లలు తలో పావలా ఇచ్చి ఆభూతద్దాల్లోంచి ఆబొమ్మలుచూసి సినిమాచూస్తున్న ఆనందాన్ని అనుభూతినీ పొందుతారు. తిరునాళ్ళల్లోనూ సంతల్లోనూ పండగల్లోనూ వీని దర్శనం ఒక ఆకర్షణ.


                      * * *