పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాగివస్తున్నట్లువివిధతరాలకు చెందిన తర్వాతికవులరచనలలో వుటంకించడంబట్టి గ్రహించవచ్చు.

     ఇది ఒక విశిష్ట విధానం.  మౌలికంగా, ఆశువుగా, అనర్గళంగామాట్లాడే సరళ భాషా చమత్కార సామర్ధ్యం దీనికి ముఖ్యావసరం.  దీనికి వ్యాస పీఠం అని కూడా పేరు.  దీనినిబట్టి ఈ పురాణప్రవచనం వ్యాసునినుండి పరంపరగా వస్తున్నట్లు భావించవచ్చు.  వ్యాసశిష్యుడు సూతనంహాముని పరమ పౌరాణికుడు.  అహ్టాదశపురాణాలను ఆపోసనపట్టి, ఆనాటి జనసామాన్యమునకు విశ్లేషించి చెప్పినవాడు.  పురాణం అనేదీ ఇంచుమించు ఏక పాత్రాభినయం. చతుర్విధాభినయాలలో వాచకం అతని ప్రఫచనమే. పురాణం చెప్పునప్పుడు మామూలు  బట్టలు కాకుండా అతను కట్టే పట్టుపంచి, విభూతి రేఖలు, విసనకర్ర  ఆహార్యం, ఇక సాత్వికాభినయం పౌరాణికుడు కధలోతానులీనమై శ్రోతలలోకూడా రసానుగుణంగా రోమాంఛకంవశ్వేదాదులు కలిగిస్తాడు, కనబడుస్తాడు.  అంగికం కళ్ళోఓ, చేతులూ, ముఖ కవళికలూ సందర్భాను సరంగా త్రిప్పుతూ అభినయిస్తుంటాడు.  అందువల్ల పౌరాణికునిది ఏకపాత్రాభినయమని చెప్పవచ్చు.
        గోదావరి నీరు త్రాగితే కవిత్వం వస్తుందని, కృష్ణాజలాలు త్రాగితే సంగీతం వస్తుందని ప్రతీతి.  ఇది నిజమమేమో అన్నట్టుగా గోదావరి సీమలో పురాణ ప్రవచనంచేసే సాహిత్య పండితులు ఎక్కువే.
      గ్రంధం ముందుంచుకొని పురాణంచెప్పే పద్దతేకాకుండా  గ్రంధం అవసరంలేకుండా పురాణప్రవచనం చేసేవారుకూడా ఉన్నారు.  వీరిలో విశేషప్రఖాతిగన్నవారు శ్రీ పురాణపండ రామమూర్తిగారు.  వీరిది రాజమహేంద్రవరం.  ద్వితీయమైన పాందిత్యంతో ఖంగుమనే కంచుకంఠంతో సామాన్యులకు సులువుగాతెలిసే ఉపమానాలతోఅనుపమానంగా చెప్పేవారు.  వచ్చిన ప్రేక్షకుడు మరికదలడం అనే ప్రసక్తి లేదు.  కధ పూర్తయ్యేవరకూ నిశ్శబ్ధంగా కూర్చోవలసిందే.  భారతం, బాగవ్గతం, రామాయాణాలు నెలలతరబడి విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపించేవి.  తెలుగునేల నాలుగుచెఱగులా ప్రఫచనంచేసి పేరుగడింఫిన మహావిద్యాంసులు, పండితప్రకాండులు వీరు.