పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బాణీలతో పాడుతూ సారంగధర, కన్యక, బాలరాజు కధలు చెబుతూ రాత్రులు పేటల్లో జనాన్ని వినోదింపజేస్తారు జముకుల కధకులు. ఇందులో నాటకప్రక్రియకుచెందిన సంవాదాలు ఎక్కువ. కధకు సంబంధించిన పాత్రలు సారంగధరుడు, చిత్రాంగి, రత్నాంగి వంటి వేషాలు ధరించి కొందరువచ్చి ఆయా పాత్రల సంభాషణళూ చెబుతూ నృత్యం చేస్తూ అభినయిస్తుంటారు. మిగిలిన వాళ్ళు శృతికి ఆనపకాయబుర్రతో చేసిన తంబురవాయిస్తూ ఒకరు జముకు వాయిస్తూ యిద్ద్రు కధ నడుపుతుంటారు. పేట ప్రజలు ఎంతో ఆర్తితో ఈ కధలువింటారు.

                   పు  రా ణం

"అంగాని వేదా: చత్వారో మీమాంసా న్యాయ విస్తర:
పురాణం ధర్మ శాస్త్రంచ విద్యాహ్యేతే చరుర్ధశ;"-
చరుర్ధశ విద్యలలో పురాణమొకటి.
"పరమ పౌరాణీకుల్ బహుపురాణ సముచ్చయంబని
మహిని గొనియాడు చుండ"
                --నన్నయ (ఆది పర్వం 32)
"ఒరయన్ నన్నయ తిక్కనాది కవులీ యుర్విన్
బురాణావశిన్ దెనుగున్ సేయుచి"
--బమ్మెరపోతన (ఆంధ్రమహాభాగవతం ప్రధమస్కంధం 130

"జనులు అప్పుడప్పుడు పౌరాణికులవలన
భాగవత భారత కధలను వినుచుందిరి"
--నన్నెచోడుడు (కుమార సంభవం. ఆ 11)

"విబుధ విప్రుల బిల్వగ బంచి
నినుము భాగవతంబు విజ్ఞాన మొదప
భారత రణకష పాటించి వినుము"
           --శ్రీనాధుడు (పల్నాటి యుద్ధం0

     ఇలాగ పురాణప్రవచనమునేది నన్నయకాలంనాటికి కనబడుతోంది. పైగా మధ్యలో ఏకాలంలోనూ మరుగుకుపోకుండా అవిచ్చిన్నంగా