పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒకకులంవరు చెప్పుచుండడంచేత ఈ కధా ప్రక్రియ జంగంకధ అనేపేరు ప్రఖ్యాతమయింది. ఈ కషాసంవిధానాన్ని సిరికి జంగలు, ఈత ముక్కు జంగాలు ఎక్కవ వ్యాప్తిలోకి తెచ్చారు. వెరు వాయించేగుమ్మెట అనే వాయిద్యాన్ని (ఢక్కీ) బుడిగె అంటారు. అందుచేత వీరిని బుడిగెజంగాలని కూడా పీలుస్తారు.' దీనికి కుడిఎడమల ఇద్దరువంతలు, మధ్య కధకునితో నృత్యంజోడించి బల్లకెక్కించారు. ఇలాబల్లకెక్కిన దానిని బుర్రకష అంటారు. ఇందు "పల్నాటియుద్ధం" 'బొబ్బిలి యుద్ధం ' ప్రసిద్ధిపొందాయి. వీరిరగడ వీరావేశం తెస్తుంది.

    **'సంగీతం, నృత్యం, నాటకం - యీనాటి జానపద రీతులమేలుకలయికను మనం బుర్రకధలో చూడగలం.  బుర్రకధలో నవరసాలూ ఉన్నాయి.  సామాన్య ప్రజలకు సాంఘిక రాజకీయ చైతన్యం కలిగించడంలో దానికదేసాటి.'
      • "శ్రీనాధుని కాలం నాటికే బుర్రకధలు బాగా ప్రచారంలో ఉన్నాయని క్రీఢాభిరామంలోని యీక్రింది పద్యంవల్ల తెల్సుస్తుంది.

దృత తాశంబున వీర గుంభితక ధుంధుంధుం కిలాత్కార సం
గతి వాయింపుచు వాంతరాశిక యతి గ్రామాభిరామంబుగా
యతి గూడం ద్విపద బ్రహంధమున వీరానీకముల బాడెనొ
క్కత ప్రత్యక్షరముం సమారకులు ఫీట్కారంబునన్ దూలగర్"

అసలు తంబురకధ రూపంలో నేదు యీరచయిత చెబుతున్న 'పార్వతీకళ్యాణం ' 'కధ ' పండితపామజనరంజకమై ప్రజల్ని విశేషంగా ఆకట్టు కుంటోంది. ఈప్రక్రియా వైశిష్ట్యంయీనాటికీ జనరంజకమే అని యిది చెబుతింది.

                           జ ము కు ల క ధ
    "సారంగో సారంగ", "రాజూలేనప్పుడూ రారాదా పోరాదా" అంటూ చిత్రాంగి సారంగధరుణ్ణి ప్రేరేపించడంవగైరా కీర్తనలు ఓ ప్రత్యేకమైన

  • సహదేవ సూర్య ప్రకాశరావు. రూపకళ. పు.378
    • లక్ష్మీ కాంత మోహన్, నాట్యకళ, ఫిబ్రవరి-మార్చి 1970 పు.129, 130
      • శ్రీనివాస చక్రవర్తి, యక్షగానవ్యాసం, నాట్యకళ ఫిబ్రవరి-మార్చి 1973 పు.12, 13