పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చంద్రపురం దగ్గర పసలపూడిలో ఇప్పటికీ వీరున్నారు. ఈ సత్తెమ్మ సంబరాలు పసలపూడి, పందలపాక, కాకినాడ జగన్నాధపురం ప్రసిద్ధి.

   ఇక తాడేపల్లిగూడేం దగ్గరగల పెంటపాడులో దానమ్మ సంబరం కూడా యిలాగే చేస్తారు. శనివారంరాత్రి పంబలాళ్ళు తెల్లవార్లూ దానమ్మ కధ చెబుతారు.  ఇది మాంధాతరాజు కధ.  ఆరాజు యొక్క నీతినిజాయితీ లను భ్రష్టు పట్టించడానికి ఒకపద్ధతి ప్రకారం దానమ్మ (దేవత) తనశక్తి యుక్తులన్నీ ఉపయోగించి రాజును అష్టకష్టాలపాలు చేస్తుంది.  (హరిశ్చంద్రుణ్ణి విశ్వామిత్రుడులాగ) అలా ఎన్ని యిబ్బందులకు గిరిచేసినా లొంగని మాంధాతరాజుని మెచ్చి తన సంపూర్ణ శక్తియుక్తులతో అతనికి అష్టయిశ్వర్యాలూ కలుగజెసిన దేవతగా కెర్తిస్తూ కధ ముగిస్తారు.  తెల్లవారి ఆదివారం జంతుబలులు. పగలు పదిగంటలకు ప్రధానపాత్రదారుడుదానమ్మ కత్తెర్కడవని నెత్తికెత్తుకుని తనకి దానమ్మ పూనినట్లుగ అభినయిస్తుంటే గ్రామసంచారం ప్రరంభమవుతుంది.సత్తెమ్మలాగే దారిఒడుగునా కాళ్ళమీద నీళ్ళు పొయ్యడం, బట్టలమీద నడిపించడం మామూలే.  ఈ సంబరానికి తూర్పుగోదావరినుంచికూడా వస్తారు దానమ్మ భక్తులు.  చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కులభేదంలేకుండా భక్తితో కొలుస్తారు.  కొత్తకార్లు, ట్రాక్టర్లు, లారీలు కొన్నవారు యీ దేవత దగ్గకుతెచ్చి, పూజలుచేసి తునిదగ్గర్ తలుపులమ్మలోవదగ్గరలాగ యీమెకు జంతుబలులనిస్తారు.

మాదిగలకులవేల్పు గొంతేలమ్మ సంబరంకూడా యిలాగే చేస్తారు సంబలాళ్లు. వీరు చేసేవి యిలవేల్పులు, కులవేల్పుల స్ంబరాలు.

                 తం బు ర క ధ
     తంబురకధ అంటే తంబుర భుజానవేసుకొని ఒకచేత్తో వాయిస్తూ రెండవచేతిలో అందె కొడుతూ ఒక పురుషుడు, ప్రక్కన ఢక్కీ వాయిస్తూ ఒకస్త్రీగాని, ఇద్దరు స్త్రీలుగాని "తందానతాన" అని వంత పాడుతుంటే బాలనాగమ్మ, కామమ్మ, లక్షమమ్మ, సన్యాసమ్మ మొదలగు కధలు చెబుతూ పల్లెజనుల్కు వినోదం కలిగించి బియ్యం, పాతబట్టలూ వసూలుచేసుకుంటారు.  
  • "ఈ కధల్ని ప్రత్యేకంగా జంగాలనే