పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/255

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనవర్తి వెంకటస్వామి, వనపర్తి సీదయ్య, డోలుకోటయ్య, శ్రెమతుల తొట గండమ్మ, అనవర్తి గనమ్మ, తోట కోటమ్మ, తోట కోటిలింగం మొదలగువారు ఒకనాదు పేరెన్నికగన్నకళాకారులు.

                         పం బ క ధ
    "అంబ రావే జగదాంబ రావే" అంటూ పల్లెల్లో సత్తెమ్మ సంబరాలు చేస్తుంటారు.  సాంబ్రాణి ధూపాలతో సంబలాళ్ళు ఆదిశక్తి అనీ, సృష్టి ఆవిర్భావం, సత్తెమ్మ మహాత్యాలూ గూర్చి ఈ సంబకధ చెబుతారు.  ఒకరు సంబనాదం వాయిస్తారు.  రెండు సన్నని చిన్న వీరణాలు లాంటివి కలిపి కట్టబది ఒకొవైపు ఒక్కోదాన్ని పుల్లంక్కలతో వాయిస్తుంటే 'సంబలక్కం సంబలక్కం ' అనే శబ్దం వస్తుంది.  మరొకరు జముకు వాయిస్తారు.  ఇంకొకరు శృతికి తిత్తి ఊదుతుంటే ఒకరు కాలికి గజ్జెలు కట్టుకొని ఎగురుతూ కధ పాడుతుంటే వాయిధ్యాల వారందరూ చెవిదగ్గర చెయ్యుంచి 'ఆ - - -' అని ఆకడతారు.  జనం కూర్చుని ఎంతో ఇష్టంగా వింటుంటారు.  దీన్నే సంబకధ అంటారు.  తెల్లవారక వీరు సంబరంగా సత్తెమ్మని ఊరావలికి సాగనంఫేటప్పుడు సత్తెమ్మ గుడిముందు ముగ్గుతోవేసిన పద్మంలో మేకపోతునుకోసి ఆ రక్తంతో ఆ ముగ్గు నెత్తేసి కొత్తకడవలో పోసి (దీనినే కత్తెరకడవ అంటారు) తమలో ఒకరికి కొత్తకోకకట్టి, రవికతొడిగి నెత్తికెత్తుతారు.  మేక ప్రేగులు తీసి అతనికి ఎడజందెం, పెడజందెంవేసి అతనిని సత్తెమ్మ గా భావిస్తూ వీధులవెంట ఊరేగింపుగా తీసుకెళతారు.  ఊరు చివర కొచ్చేసరికి ఆమె నుద్దేశించి -

"సత్తెమ్మ సత్తెమ్మా సత్తెమైన సత్తెమ్మా
  ఏ తల్లీ కన్నదే సత్తేమ్మా ?
  నీది మల్లేపువ్వుల చాయ
  నీది మల్లేమొగ్గల చాయ"

అని సన్నసన్నగా ఆశ్లీలార్ధంవచ్చేటట్టు పాడుతూ ఊరుదాటగానే పచ్చి బూతు పాటలు ప్రారంభిస్తారు. అది ఆమె కిష్ఠమటమరి. క్రీడాభిరామంలో బవనీలు అని చెప్పబడ్డవాళ్ళూ వీళ్ళే వీరు కులానికి మాదిగలు. రామ