పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

             'శివశివ మూర్తివి గణనాధా
              నీవు శివుని కుమారుడవు గణనాధా.'

మూడుకాలలలోనూ నృత్యంచేస్తూచేసేఈభజన ఎంతో నయనానందంగా వుంటుంది. ఇంచుమించు నృత్యం కోలాటంలోలాగే, ఇందులో రామదాసుకీర్తనల్లాంటి భక్తిగీతాలు, కృష్ణలీలలు, వేదాంతరత్నాలు పాడతారు. సంబరాల్లోనూ, జాతర్లలోనూ ప్రదర్శిస్తుంటారు. ఇది భక్తిప్రలోధకమే గాకుండా యువజనుల్లో క్రమశిక్షణ నేర్పుతుంది. గీతానికి శృతి, లయ అలవాటు చేస్తుంది.

                         నృత్యతాళభజన

ఇందులో చెక్కలకు బదులు చిప్పతాళాలు వాడతారు. దీనికి నృత్యం, తాళం ప్రధానం, మధ్యలో వత్తులువెలిగించిన దీపంచెట్టువుంటుంది. వారు దానిచుట్టూ వలయంగా నిలబడి "తాండవనృత్యహరీ గజానన, ధిమిట ధిమికిట బాజామృదంగ, హరిలోరంగహరీ గజానన" అనే గణపతి ప్రార్ధనతొప్రారంబించి భూమి అదిరేలా గెంతుతూ ప్రేక్షకదృష్టిని తమపై కేంద్రీకరింపజేసుకుంటారు. "రామభజనచేయరే రజితాగిరి రామభజనచేయరే, తంబురమీటుతూ తాళము వేయుచూ తకిట తకిటయని నృత్యము సల్పుచు రామభజనచేయరే" అనే కీర్తన మంచి దరువులతో ఊపేసి జనంచేత శభాష్ అనిపించుకుంటారు. దీనికి చెక్కభజనలలోలాగే గురువు వలయంలో ఉండి కీర్తననదుపుతూ అడుగులు చూపిస్తూ భజనచేయిస్తుంటాడు. హార్మోనీ మద్దెలా మామూలే. దీనికి ప్రత్యేక వేషాలు లేకపోయినా రుమాలు నడుముకు చుట్టడం, కాళ్ళకు గజ్జెలుకట్టడం ఉంటుంది. "శ్యామలాదేవీ - రమ్మంటేరావే" అనే వీరి భజనకీర్తనకి ముగ్ధులుకానివారుండరు.

   ఇవి దేవుడి సంబరాల్లోనూ, అమ్మవారి జాతర్లలోనూ తూర్పు పశ్చిమగోదావరిజిల్లాలలో యిప్పటికీ కనిపిస్తుంటాయి.
                             వీధి భాగవతం
    వీధి భాగవతులు పలురకాలు; కూచిపూడి భాగవతులు, తూర్పు భాగవతులు, యానాది భాగవతులు ఇలా ఇంకా ఎన్నో, తూర్పు