పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/243

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గరిడిన్ కాలపు హంతకాడు చరమా
గస్కంధముంజెర్చు" అని

                     కో లా టం
   పదిహెను ఇరవైమంది వలయంగాఏర్పడి రూళ్ళకర్రల్లా గుండ్రంగా సాపుచేయబ"డిన ఒక అడుగుపొడవుకర్రలను ప్రతిఒక్కరూ రెండేసిచొప్పున రెందుచేతుల్తోనూ పట్టుకొని ఓకరిచేతిలోనికర్రను మరొకరిచేతికర్రను తాకిస్తూ ఆచప్పుడును తాళంగా చేసికొని లయబద్ధమైన అడుగులువేస్తూ 'తెయ్యక్కడతా జనుతా, అంటూ 'ఒచిన్నదాన విడువనె కొంగు ' వంటి శృంగార జానపద గీరాలూ, భక్తిగెరాలూ గురువు పాడుతుంటే కోలాతం వేసేవారు ఆ పల్లవిని వంతపాడుతూ గెంతుతుంటే వినడానికి చూడడానికి వినోదంగా ఉంటుంది.  ఈ కోలాటాలు పల్లెలలోని ఆయా పేటల్క యువకులు విరామకాలంలోఒక గురువునుపెట్టుకొని నేర్చుకొని సంబరాలలో సరదాగా వేస్తుంటారు.
  • 'కోలాటం జానపదులను ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని యిస్తుంది

దీనిలో వర్ణ చలనము, వేష సామరస్యము, గమనసామరస్యము
    మువ్వల మోత, కోలల లయ, రాగ సరళి, కంఠమేళ, కధా
    సౌందర్యము ఒక్కుమ్మడిగా ఏకమయి అలరిస్తవి '.

    • 'హంపీ విజయనగరమునందలి బవనప్రాకారబిత్తికలమీద

     కోలాటమువేయు స్త్రీ పురుషుల వివిధభంగిమలుకల బిత్త
     రువులనెకములు చెక్కబది యున్నవి.

      • 'విజయనగరరాజులకాలమున కోలాటమందు జనుల కాసక్తి

       ఎక్కువగానుండెను '. పాల్కురికి సోమనాధుని బసవ పురాణంలో
       యిలాచెప్పబడించి -


  • కృష్ణశ్రీ పల్లెపదాలు (ఆంధ్రుల జానపద విజ్ఞానం పు.71 నుండి గ్రహింపబడింది)
    • జానపద కళాసంపద పు.6 డా. తూమాటి దోణప్ప
      • ఆంధ్రుల సాంఘికచరిత్ర. పు.259. సురవరం ప్రతాపరెడ్డి