పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తావన


  • [1] "మా తెలుగు తల్లికీ మల్లి పూదండ

   మాకన్న తల్లికీ మంగళారరులు
   గలగలా గోదారి కదలి పోతుంటేను
   బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
  బంగారు పంటలే పండుతాయీ
  మురిపాల ముత్యాలు దొరలుతాయీ....."

గోదావరీ, కృష్ణా, తుంగభద్రానదుల పావన జలాలతో పునీతమౌతున్న తెలుగునేల ఒకనాదు వెలనాదు, వేంగినాదు, సప్పినాదు, ములికినాదు, పల్నాడు, పాకనాడు, పొత్తపినాడు, కమ్మనాడు మొదలగు నాడులుగా విభజింపబడింది. స్వతంత్రావతరణనాటికి అది వేర్వేరు ప్రభుత్వాల క్రింద, ఆంధ్ర, తెలంగాణా, అని రెండుగా విభజింపబడివుంది. బ్రిటిషువారి మూసలో చ్రిత్రకారులు సర్కారులు, రాయలసీమ, తెలంగాణా అని మూడు ప్రాంతాలుగా విభజించి పరామర్శించరు. సాహిత్యకారులు తమ కావ్యాలలో రాయలసీమ, పలనాటిసీమ, వెలనాటిసీమ, నెల్లూరుసీమ, గుంటూరుసీమ, దివిసీమ, కోనసీమ, కళింగసీమ వగైరా పేర్లతో ఆయా ప్రాంతాలను పేర్కొనడంతో సీమల పేరుతో మరొక ప్రాంతీయ విభజన కనిపిస్తోంది. ఇంతకీ ఎవరు ఎలావిభజనచేసినా మొత్తంగా--

"తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణా నాది
రాయలసీమ నాది
నెల్లూరు నాది
సర్కారు నాది
అన్నీ కలిసిన తెలుగునాడు
మనదే మనదే మనదే"

అన్న సి.నా.రె. గీతం యీ జాతికి వేదం. అంతా తెలుగుసీమ అనేది యీ పూలదండలో దాగున్న దారం.

  1. * శంకరంబాడి సుందరాచార్యులు