పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/234

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జా న ప ద క ళ లు

    తెలుగువారి సహజమైన నిధి వారి జానపద కళాసంపద.  తినడానికి తిండి ఉన్నా లేకున్నా, ఆకలితోనైనాసరే ఈప్రదర్శనలు చూసి ఆనందించి,అప్పుచేసైనా తృణమో ఫణమో ఇచ్చి కళాకారులను ఆదరించే సహృదయులైన పల్లెజనులే వీరి మహారాజ పొషకులు.  కళాకారులు కూడా అల్ప సంతుష్టులు - ఆపూట గడిస్తే చాలు వారికి చిదానందమే.
           ప్రాచీన కాలంనుంచీ ప్రఖ్యాతంగా కనుపించే జానపద కళారీతులు దొమ్మరాట, గంగిరెడ్లాట, మోళీఆట, గుర్రాలాట, మల్లేలాట. గరగాట. బండ్లమీద వేషాలు, గారడీలు, ఎలుగుబంట్లవేషాలు, కొయనృత్యం, కర్రసాము, కోలాటం, బుట్ట బొమ్మలాట, భోగం మేళం, కోలసంబరం, పండరిభజన, తోలుబొమ్మలాట, వీధిభాగోతం, పంబకధ, తంబురకధ, బుర్రకధ. జముకులకధ, హరికధ, పగటివేషాలు మొదలైనవి.
                        దొ మ్మ రా ట

T "దొమ్మరివిద్యలలో కనిపించే ఏకాగ్రత, క్రమశిక్షణ అంతగా కొట్టిపారెయ్యాలసింది ఎంతమాత్రం కాదు "

      దొమ్మరాట సాధారణంగా సంక్రాంతి పండుగ రోజులలో కడతారు.  దొమ్మరజాతివారు రెండు మూడు కుటుంబాలు కలిసి ఒకజట్టుగా వస్తారు.  జట్టులొ అయిదారుగురు స్త్రీలుంటాదు.  వారిలో ఇద్దరు ముగ్గురైనా పరువంలొ ఉన్న పడుచులుంటారు.  వీరె ఆజట్టుకు ప్రధానమైన ఆకర్షణ.  ఊరి నడిమధ్యలో ఆటకు అన్ని ఏర్పాట్లుచేసికొని ఉదయంనుండీ ఈ కళాకారులు ఊళ్లోధనికులైన పెద్దవాళ్ళ ఇళ్ళకు తిరిగి పురుషులను ఆహ్వానిస్తూ చేయితగిలించినట్టూ చూపుతలించినట్టూ వారిని ఆకట్టుకొని మొత్తంమీద ఊరంతా ఆట దగ్గరకు చేరేటట్టు చేసుకుంటారు.
    ఒకరు డప్పు ఒకరు డోలు వాయిస్తుంటే వానికనుగుణంగా వీరిలో ఆడా మగా గోచీలు ఎగ్గట్టి తొడకొడుతూ జబ్బచరుస్తూ 'హౌరియా, హౌరియా ' అంటూ మొగ్గలేస్తారు.  మనఇళ్ళల్లో పిల్లలు శిరస్సుక్రిందికి

T. శ్రీశ్రీ 'రాజమకుటం ' ప్రత్యేకసంచిక. 1980