పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుక్కపని గాడిదచేసినట్టు
కాకైకలకాలం బతికేకంటే హంసై ఆరుమాసాలు బ్రతికినాచాలు
కడుపుచింపుకుంటే కాళ్ళమీదపడుతుంది
కొండనాలుక్కి మందేస్తే ఉన్ననాలుక ఊడిపోయిందట.
కరవమంటే కప్పకికోపం, విడమంటే పాముకికోపం.
కొడుకుబాగుండాలి, కోడలుముండామొయ్యాలి.
కూకుంటేగడవంది కూలికెడితే గడుస్తుందా అని.
కుమ్మరాఫలొ ఇత్తడిముంతలు దొరుకుతాయా ?
కధ అడ్డం తిరిగింది.
కొత్తగా నీరొస్తే అర్ధరాత్రి గొడుగుపట్టమన్నాడట.
కలిసికొట్టరా కావేటిరంగా అని.
కుమ్మరికికుండకరువు, కమ్మరికితెడ్డు కరుఫ్గు.
కరువులో అధికమాసం.
కాడు రమ్మంది - ఊరుపొమ్మంటుంది.
కడుపు వీపు అన్నట్టు
కడూనిండిననోటికి గారెలుచేదు
కుడితిలోపడ్డ ఎలకలాగ.
కూర్చునితింటే కొండైనా తరిగిపోతుంది.
కొండని తవ్ఫి ఎలకనుపట్టినట్టు
కొత్తనీటికి చేపలెదురెక్కినట్తు
కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి.
గొంగట్లో కూర్చుని వెంట్రుకలు లెక్కపెట్టినట్టు
గారం గారెలకేడిస్తే వీపు దెబ్బలకేఛ్చిందట.
గాలీవానా వస్తే కధే లేదు
గుడినిమింగే వాడొకడైతే గుడినీ గుళ్ళో లింగాన్ని మెంగేవడొకడు.
గుడ్దిలో మెల్లలాగ.
గుడ్డెద్దు చేలోపడ్డట్టు.
గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందట.